Movie News

ఫ్యాన్ వార్స్ పీక్స్.. స్టేట్మెంట్ ఇచ్చిన హీరో

టాలీవుడ్లో స్టార్ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్స్ చూశాక ఎందుకింత దిగజారి ప్రవర్తిస్తుంటారు అనిపిస్తుంటుంది. ఐతే ఈ జాఢ్యం అంతా తమిళ అభిమానుల నుంచి వచ్చిందే. సోషల్ మీడియాలో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి అవతలి హీరోను కించపరచడం.. దారుణాతి దారుణమైన కామెంట్లు, మీమ్స్ చేయడం మొదలైంది తమిళంలోనే. అక్కడ టాప్ హీరోలైన విజయ్, అజిత్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.

ఒకప్పుడు ఆఫ్ లైన్ ఫ్యాన్ వార్స్ ఒక స్థాయి వరకే ఉండేవి. కానీ సోషల్ మీడియా వచ్చాక అవతలి హీరోను కించపరుస్తూ ట్వీట్లు వేయడం.. హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేయడం లాంటి దిగజారుడు పనులు మొదలుపెట్టారు. వాళ్లు పెట్టిన కొన్ని హ్యాష్ ట్యాగ్స్ చూస్తే ఫ్యాన్ వార్స్ ఈ స్థాయిలో జరుగుతాయా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ట్రెండ్‌ను మనవాళ్లు కూడా అనుకరిస్తుండడం గమనించవచ్చు.

ఐతే వేరే ఇండస్ట్రీల ఫ్యాన్స్ తమను అందుకునే ప్రయత్నం చేసిన ప్రతిసారీ.. దిగజారుడుతనంలో ఇంకో అడుగు కిందికి వెళ్లిపోతుంటారు తమిళ అభిమానులు. మామూలుగానే విజయ్, అజిత్ అభిమానుల ఫ్యాన్ వార్స్ ఇంక రేంజిలో ఉంటాయంటే వచ్చే సంక్రాంతికి ఆ ఇద్దరు హీరోల సినిమాలు వారిసు (తెలుగులో వారసుడు), తునివు ఒకేసారి బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతుండడంతో అభిమానుల గొడవలు ఇంకో స్థాయికి చేరుకున్నాయి. సంక్రాంతికి విజయ్ సినిమాదే హవా అని అతడి అభిమానులు అంటుంటే.. తమ హీరోదే పైచేయి అని అజిత్ ఫ్యాన్స్ అంటున్నారు.

అంత వరకు ఆగితే ఓకే.. అవతలి హీరోను, అతడి సినిమాను దారుణంగా కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇంకా విడుదలకు రెండు నెలలు ఉండగానే ఫ్యాన్ వార్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక రిలీజ్ టైంకి ఈ గొడవలు ఏ స్థాయికి చేరుకుంటాయో అన్న భయాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ స్పందించి.. ఫ్యాన్ వార్స్ గురించి నేరుగా ప్రస్తావించకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం బతుకుదాం, వేరేవాళ్లను బతికిద్దాం.. డ్రామా వద్దు, నెగెటివిటీ వద్దు.. మీ చుట్టూ ప్రోత్సహించే వారినే పెట్టుకోండి. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి దిశగా ప్రేరణ పొందండి. అసూయ వద్దు.. ద్వేషం వద్దు’’ అంటూ సందేశం ఇచ్చాడు అజిత్. ఎక్కడా సినిమాలు, ఫ్యాన్ వార్స్ గురించి ప్రస్తావన లేకపోయినా.. సోషల్ మీడియాలో జరుగుతున్న గొడవల నేపథ్యంలోనే అజిత్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడన్నది స్పష్టం.

This post was last modified on November 18, 2022 10:01 am

Share

Recent Posts

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

3 hours ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

3 hours ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

4 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

5 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

7 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

7 hours ago