Movie News

నాని క్లాప్.. అప్పుడలా… ఇప్పుడిలా

వారసుల ఆధిపత్యం సాగే టాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా పెద్ద స్టార్లుగా ఎదిగిన హీరోలు చాలా కొద్ది మందే కనిపిస్తారు. కొత్తతరంలో నాని ఆ అరుదైన జాబితాకు చెందిన వాడే. ‘అష్టాచెమ్మా’ అనే చిన్న సినిమాతో పరిచయం అయిన అతను.. ఇప్పుడు టైర్-2ను దాటి టైర్-1 మీద కన్నేశాడు. తన కొత్త చిత్రం ‘ది ప్యారడైజ్’ ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతోంది. అంతకుమించి బిజినెస్ చేసేలా కనిపిస్తోంది. 

ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. నాని రేంజ్ మారిపోవడం ఖాయం. హీరోగా ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకున్న నాని.. నిర్మాతగా కొత్త నటులు, దర్శకులకు లైఫ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ‘కోర్ట్’ చిత్రంతో తన అభిరుచిని చాటుకుని పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న నాని.. ఇప్పుడు మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన నితిన్‌తో సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఈ కలయిక ఊహించనిదే.

ఒకప్పుడు నితిన్.. నాని కంటే పెద్ద హీరో. అసలు నాని హీరో అవ్వడానికి ముందు నితిన్ ఎలాంటి వైభవం చూశాడో తెలిసిందే. జయం, దిల్, సై చిత్రాలతో అతను సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఐతే నితిన్ నటించిన ఏ సినిమాకు అన్నదానిపై క్లారిటీ లేదు కానీ.. ఒక చిత్రానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూ క్లాప్ కొట్టాడట. ఇప్పుడేమో నితిన్ సినిమాకు నిర్మాతగా క్లాప్ కొట్టడం తన ఎదుగుదలకు నిదర్శనం అంటూ అభిమానులే కాదు, సినీ ప్రముఖులు కూడా నానికి ఎలివేషన్ ఇస్తున్నారు.

స్వయంగా బండ్ల గణేష్ లాంటి ప్రముఖ నిర్మాత నాని అప్పటి, ఇప్పటి ‘క్లాప్’ల గురించి ఒక పోస్టు పెట్టాడు. స్వయంకృషితో నాని ఈ స్థాయికి రావడం పెద్ద ఇన్‌స్పిరేషనల్ స్టోరీ అనడంలో సందేహం లేదు. అదే సమయంలో ఇంకా పెద్ద రేంజిలో ఉండాల్సిన నితిన్.. ఇప్పుడు హిట్టు కోసం కష్టపడుతుండడం తన అభిమానులను ఒకింత బాధిస్తోంది. మరి నిర్మాతగా ‘లక్కీ హ్యాండ్’ అని  పేరున్న నాని ప్రొడ్యూస్ చేసే సినిమాతో అయినా అతను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. 

This post was last modified on August 4, 2026 10:19 pm

Share

Recent Posts

3 వేల జీతం వచ్చే సర్పంచ్ స్థానాల కోసం కోట్ల ఎందుకు?

ఒక గ్రామానికి స‌ర్పంచ్‌. నిజానికి పెద్ద‌గా జీతం ఉండ‌దు. ప్ర‌భుత్వం నుంచి పెద్ద‌గా ఆద‌ర‌వు కూడా ద‌క్క‌దు. కేవ‌లం 3…

2 hours ago

తెలంగాణ కోసం పని చేస్తున్నారా? ఐతే ఈ అవార్డు మీదే!

తెలంగాణ ప్ర‌జ‌ల కోసం.. తెలంగాణ స‌మాజం కోసం అనేక మంది క‌ష్ట‌ప‌డ్డారు. క‌ష్ట‌ప‌డుతున్నారు. అయితే.. వారికి స‌రైన గుర్తింపు లేక‌పోవ‌డం..…

5 hours ago

ఐపీఎల్‌తో ధోని మొత్తం ఆదాయం ఎంత?

ఐపీఎల్‌లో ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోనీ సంపాదన రూ.200 కోట్ల మార్కును దాటింది. 2008లో రూ.6 కోట్లతో మొదలైన అతడి…

5 hours ago

మ‌హావ‌తార న‌ర‌సింహ.. తెలుగు రైట‌ర్ ఆవేద‌న‌

మ‌హావ‌తార న‌ర‌సింహ‌.. గ‌త ఏడాది పాన్ ఇండియా స్థాయిలో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సినిమా. ఈ యానిమేష‌న్ మూవీ రిలీజ‌య్యే…

8 hours ago

ఛలో దర్శకుడిని తిట్టారా పొగిడారా

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో వెంకీ కుడుముల పేరు ఖచ్చితంగా ఉంటుంది. రష్మిక మందన్న ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే ఛలో…

8 hours ago

లిఫ్ట్ అడిగేటప్పుడు జాగ్రత్త మహిళలు

మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఇంటికి వెళ్లేందుకు ఆటోలో లిఫ్ట్ ఇస్తామని నమ్మించిన ఇద్దరు…

8 hours ago