భాగ్యశ్రీ.. నిన్నటి తరం భారతీయ సినీ ప్రేక్షకులు ఈ పేరును అంత సులువుగా మరిచిపోలేరు. చేసినవి తక్కువ సినిమాలే కానీ.. ఒకే ఒక్క సినిమాతో ఆమె ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఆ చిత్రమే.. మైనే ప్యార్ కియా. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది భాగ్యశ్రీ. ఈ సినిమా ప్రేమ పావురాలు పేరుతో తెలుగులో అనువాదమై ఇక్కడా ఘనవిజయం సాధించింది.
ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సినిమా రాణాలో నటించి మాయమైన భాగ్యశ్రీ.. మళ్లీ ఇటు చూడలేదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రాధేశ్యామ్‌లో ఆమె అతడికి తల్లి పాత్ర పోషిస్తుండటం విశేషం. హిందీలో కూడా సినిమాలు చేయడం మానేసిన భాగ్యశ్రీ.. ఇప్పుడిలా తెలుగు సినిమాలో నటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే బాహుబలితో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్‌తో సినిమా అనే సరికి తల్లి పాత్రకైనా ఆమె రెడీ అనేసినట్లుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుంఉటందని.. సినిమాలో ఆమె హైలైట్ అవుతుందని అంటున్నారు. కాగా.. ఈ సినిమా విడుదల కాకముందే తెలుగులో మరో బడా స్టార్ హీరోకు తల్లిగా నటించే అవకాశం ఆమె ముందుకొచ్చినట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు.
పరశురామ్ దర్శకత్వంలో అతను సర్కారు వారి పాట పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన\ సంగతి తెలిసిందే. ఇందులో అతడి తల్లిదండ్రులిద్దరి పాత్రలు కీలకమట. రాధేశ్యామ్‌లో భాగ్యశ్రీ పెర్ఫామెన్స్ గురించి తెలుసుకున్న పరశురామ్.. ఆమెతో ఈ పాత్ర చేస్తే సినిమాకు ఆకర్షణ అవుతుందని భావించాడట. చర్చలు జరుగుతున్నాయని.. ఆమె ఈ సినిమా ఓకే చేయొచ్చని అంటున్నారు.
This post was last modified on July 14, 2020 12:27 pm
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…
కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ని…
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…