శేష్ కి పెద్ద ఛాలెంజ్!

డిఫరెంట్ మూవీస్ తో హీరోగా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచుకున్న అడివి శేష్ ‘హిట్ 2’ తో డిసెంబర్ లో థియేటర్స్ లోకి రానున్నాడు. ఇటివల మేజర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన శేష్ కి ‘హిట్ 2’ సక్సెస్ చాలా ముఖ్యం. క్షణం , గూడచారి, మేజర్ ఇలా సక్సెస్ ఫుల్ మూవీస్ తో ఓ బ్రిడ్జ్ కట్టుకున్నాడు శేష్. ఆ సినిమాలకు శేష్ రైటర్ గా కూడా వర్క్ చేశాడు. స్క్రీన్ ప్లే రైటర్ గా మంచి పనితనం చూపించాడు. 

ఇక హిట్2 కి కేవలం హీరోగా మాత్రమే వర్క్ చేశాడు. శేష్ ఎంట్రీ కంటే ముందే హిట్2 స్క్రిప్ట్ లాక్ అయి పోయింది. ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాకు సీక్వెల్ కావడంతో శేష్ దర్శకుడికి ఫుల్ ఫ్రీడం ఇచ్చేశాడు. పైగా నాని ఈ సినిమాకు ఓ నిర్మాత కాబట్టి నేచురల్ స్టార్ మీద భరోసా పెట్టాడు. టీజర్ క్లిక్ అయింది. త్వరలోనే ట్రైలర్ కూడా రానుంది. హిట్ తో విశ్వక్ సేన్ సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు శేష్ వంతు ఈ క్రైం థ్రిల్లర్ తో కుర్ర హీరో ఎలాంటి హిట్ కొడతాడా ? అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. 

అయితే హిట్ కథకి ఇది కొనసాగింపు కాదని ఇంకో మర్డర్ కేసుతో సెకండ్ కేసుగా హిట్ 2 వస్తుందని హిట్ ఇచ్చేశారు. మరి ఈ సెకండ్ కేస్ తో దర్శకుడు కూడా సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు. హిట్ ని హిందీలో అక్కడ ఫ్లాప్ అందుకున్నాడు శైలేష్. ఇప్పుడు కుర్ర హీరో శేష్ తో పాటు దర్శకుడు శైలేష్ కొలను కి కూడా హిట్ 2 సక్సెస్ అవసరమే.