సీనియర్ హీరో అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మరీ యంగ్ హీరో విశ్వక్‌సేన్ గురించి ప్రొఫెషనలిజం లేని నటుడంటూ కామెంట్ చేశాడు. అయితే మన ఫలక్‌నామాదాస్ మాత్రం.. కథలో చేంజెస్ అడిగితే రియాక్ట్ అవ్వలేదని, అందుకే ఇబ్బందిగా అనిపించి పక్కకు తప్పుకున్నానని సెలవిచ్చాడు. ఏదేమైనా కూడా, విశ్వక్ అసలు డైరక్టర్ అండ్ రైటర్ పనుల్లో వేలుపెట్టేస్తున్నాడంటూ ఇప్పుడు టాలీవుడ్ అంతా ఒక హాట్ టాపిక్‌గా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఇది మనోడికి ప్లస్సా మైనస్సా అంటే మాత్రం.. రెండూ అనే చెప్పాలి.
వాస్తవానికి యాక్టర్ అవ్వడానికి ముందే విశ్వక్ ఎడిటర్‌గా కూడా పనిచేశాడు. కాబట్టి నేచురల్‌గా సినిమా రాస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు అతగాడి ఇన్‌పుట్స్ కాస్త ఎక్కువగానే ఉండే ఛాన్సుంటుంది. అలాగే తనే సొంతంగా ఇప్పటికి రెండు సినిమాలు (ఫలక్‌నామాదాస్, ధమ్కీ) డైరక్ట్ చేశాడు కాబట్టి, ఆ యాంగిల్లో కూడా ఖచ్చితంగా తననుండి దర్శకుడికి ఎంతోకొంత ప్రెజర్ ఉండకపోదు. కాకపోతే ఇలా చెయ్యడం కారణంగా.. సినిమాలో వేలు పెట్టేస్తాడని చాలామంది దర్శకులు ఫ్యూచర్లో మనోడి దగ్గరకు రాకపోవచ్చు. అది మైనస్. కాని ఇతగాడి చేతిలో సినిమాలు పెడితే, డైరక్టర్ నుండి ప్రతీ యొక్కరి జాబ్ వరకు తనే కేర్ తీసుకుంటాడని ప్రొడ్యూసర్లు అనుకునే ఛాన్సుంది. అది ప్లస్.
ఒక విధంగా చెప్పాలంటే.. ఎవరో పెద్ద హీరో కథ చెప్పాడనో పెద్ద ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చాడనో సినిమాలు సైన్ చెయ్యకుండా.. ముందుగానే బౌండ్ స్క్రిప్ట్ అడిగి… అది నచ్చాక.. విశ్వక్‌సేన్ సినిమాలను సైన్ చేస్తే బెటర్. ఇది అర్జున్ సినిమా కాబట్టి సరిపోయింది.. అదే ఎవరన్నా పెద్ద డైరక్టర్ సినిమానో, పెద్ద బ్యానర్ తీసే సినిమానో అయితే ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిపోయేదే!