నిన్న వారసుడు ఫస్ట్ ఆడియో సింగల్ విడుదలైంది. విజయ్ స్టెప్పులు రష్మిక మందన్న గ్లామర్ వెరసి పిక్చరైజేషన్ మొత్తం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్ లోనే సాగింది. పాట మరీ బీస్ట్ లో అలమతి అబిబో రేంజ్ లో అయితే లేదు. ఆ సాంగ్ రిలీజైనప్పుడు చాలా తక్కువ టైంలో మిలియన్ వ్యూస్ తోనే కాదు ట్రెండింగ్ పరంగానూ వేగంగా దూసుకుపోయింది. ఈ రంజితమే ఆ స్థాయిని అందుకోవడం డౌటేనని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. నిజానికి దీని మీద ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. తమన్ ఎలాంటి ట్యూన్ ఇచ్చాడో అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూశారు.
వాళ్ళను పూర్తి నిరాశ పరచకపోయినా ఇంకేదో మేజిక్ టచ్ మిస్ అయ్యిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. దీనికి మహేష్ అభిమానులకు కనెక్షన్ ఏంటనిపిస్తోందా. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 28కి స్వరాలు సమకూరుస్తుంది తమనే. అయితే సర్కారు వారి పాట విషయంలో అతను ఆశించిన అవుట్ ఫుట్ ఇవ్వలేదని ఇప్పటికీ జనాలు రుసరుసలాడతారు. అందులో కంటెంట్ యావరేజ్ గా ఉన్నప్పటికీ తనవరకు కనీసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయినా గుర్తుండిపోయేలా ఇవ్వలేదని కంప్లయింట్. దూకుడు, బిజినెస్ మెన్ నాటి క్వాలిటీని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
ఇలా అడగటంలో లాజిక్ ఉంది. ఎందుకంటే అల వైకుంఠపురములో నుంచి తమన్ డిమాండ్ అంతకంతా పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. కానీ అవుట్ ఫుట్ మాత్రం స్థిరంగా లేదు. ఒకటి రెండు ఆల్బమ్స్ నిరాశపరుస్తున్నాయి. అందుకే త్రివిక్రమ్ మూవీకి బెస్ట్ ఇమ్మని కోరుతున్నారు. గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్, అఖండ లాంటి వాటిని కేవలం బీజీఎమ్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన తమన్ కనక సరిగా ఫోకస్ పెడితే మహేష్ కు మరోసారి అవుట్ స్టాండింగ్ స్కోర్ ఇస్తాడని నమ్ముతున్నారు. ఇంకా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాని నేపథ్యంలో రేపు త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఏదైనా అప్డేట్ ఉండొచ్చనే ఆశతో ఉన్నారు. అలాంటిదేమి లేదని ఇన్ సైడ్ టాక్.