హరీష్ శంకర్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోలతో అతను సినిమాలు చేశాడు. అతడికి మంచి సక్సెస్ రేట్ ఉంది. చివరగా అతను ‘గద్దలకొండ గణేష్’ లాంటి హిట్ ఇచ్చాడు. ఇలాంటి ట్రాక్ రికార్డున్న దర్శకుడు మూడేళ్లకు పైగా ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉండడం అనూహ్యమైన విషయం.
అలా అని అతడికి ఛాన్సుల్లేక కాదు. డిమాండ్ తక్కువై కూడా కాదు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో రెండేళ్ల ముందే అతడికి సినిమా ఓకే అయింది. ‘భవదీయుడు భగత్ సింగ్’ పేరుతో టైటిల్ ఖరారు చేశారు. స్క్రిప్టు లాక్ అయింది. అయినా సరే.. పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి కాల్ షీట్లు కేటాయించకపోవడంతో సినిమా ముందుకు కదలట్లేదు. ఇదిగో అదిగో అనుకుంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి.
ఇక పవన్ 2024 ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో రాజకీయ రణరంగంలోకి దిగడానికి ముందు ‘హరిహర వీరమల్లు’ను పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి.. ‘భవదీయుడు భగత్ సింగ్’ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కడం కష్టమే అని తేలిపోయినట్లే. పవన్ ఏం చెప్పాడో ఏమో కానీ.. హరీష్ శంకర్ అయితే వాస్తవాన్ని అర్థం చేసుకుని ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.
అతను ప్రస్తుతం ముంబయిలో మకాం వేసినట్లు సమాచారం. అక్కడ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ కాన్‌కు కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడట హరీష్. టాలీవుడ్లో సల్మాన్ ఖాన్ క్లోజ్ కాంటాక్ట్స్ ద్వారా ఆయన అపాయింట్మెంట్ సంపాదించి.. మంచి మాస్ మసాలా కథ చెప్పాలని చూస్తున్నాడట హరీష్. బాలీవుడ్ సినిమాలు, అక్కడి స్టైల్ మీద హరీష్‌కు మంచి అవగాహన ఉంది.
అతడికి హిందీ మీద మంచి పట్టూ ఉంది. కాబట్టి సల్మాన్ ఓకే చెబితే.. హిందీ ప్రేక్షకులు, సల్మాన్ అభిమానుల అభిరుచికి తగ్గట్లు సినిమా తీయడం హరీష్2కు కష్టమేమీ కాదు. మరి భాయ్ మన స్టార్ డైరెక్టర్‌కి ఛాన్సిస్తాడేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates