అదేంటి బ్లాక్ బస్టర్ తో మెగా డిజాస్టర్ కి పోలికేంటనే డౌట్ వచ్చిందా. ఇది నిజమే. ఇటీవలే టీవీలో వరల్డ్ ప్రీమియర్ జరుపుకున్న ఆచార్యకు 6.3 టిఆర్పి వచ్చింది. విక్రమ్ మొదటిసారి ప్రసారం జరిగినప్పుడు వచ్చింది 5.10. షాకింగ్ గా ఉంది కదూ. శాటిలైట్ ట్రెండ్స్ ఈ మధ్య ఇలాగే ఉంటున్నాయి. థియేటర్లలో అత్యంత దారుణంగా బోల్తా కొట్టిన ఆచార్యకి ఈ మాత్రం రావడమే చాలా ఎక్కువ. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయినప్పుడూ విపరీతమైన నెగటివిటీ మూటగట్టుకున్న ఈ మెగా మూవీ బుల్లితెరపై డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం గమనార్హం. విషాదంలో కొంత ఊరటన్న మాట.
ఇలా ఎందుకు జరిగిందనేదానికి కారణం ఉంది. విక్రమ్ పూర్తిగా బిగ్ స్క్రీన్ మీద ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన సినిమా. సౌండ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో కూర్చుని చూస్తే లోకేష్ కనగరాజ్ అనిరుద్ రవిచందర్ చేసిన మేజిక్ అర్థం కాదు. అందుకే ఫస్ట్ టైం టెలికాస్ట్ లో మొదలైన కాసేపటికే ఛానల్ మార్చిన ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. కానీ ఆచార్య అలా కాదు. ఎంత బాలేదని తెలిసినా సరే చిరంజీవి చరణ్ లు కలిసి నటించారు కదా ఓసారి ఏముందో చూద్దామని లుక్ వేసిన వాళ్ళు ఎక్కువే. అయినా ఓటిటి కాలంలో కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ కే 10 దాటి రేటింగ్ రాలేదు.
ఇక్కడే కాదు కోలీవుడ్ లోనూ ఇలాగే జరిగింది. దీపావళికి ప్రీమియర్ జరుపుకున్న విక్రమ్ తమిళ వెర్షన్ కన్నా పాతికేళ్ల పాత సినిమా రజనీకాంత్ అరుణాచలంకు రెట్టింపు టిఆర్పి వచ్చింది. టాప్ వన్ ప్లేస్ లో పదిసార్లు ఆల్రెడీ వచ్చిన విశ్వాసం కూర్చుంది. బీస్ట్ రెండో స్థానంతో సరిపెట్టుకొవాల్సి వచ్చింది. ఇలా చిత్ర విచిత్ర సమీకరణాలు నమోదవుతున్నాయి. మొత్తానికి ఓటిటి దెబ్బ శాటిలైట్ మీద ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇంతకన్నా ఉదాహరణలు అక్కర్లేదు. గతంలో మరో మెగా డిజాస్టర్ వినయ విధేయ రామ సైతం వచ్చిన ప్రతిసారి హయ్యెస్ట్ రేటింగ్స్ తెచ్చుకున్న సంగతి మర్చిపోకూడదు.
This post was last modified on November 4, 2022 4:29 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…