ముత్తు.. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటి. ‘బాషా’ కంటే ముందు తెలుగులో రజినీకి మంచి ఫాలోయింగ్ రావడానికి ఈ సినిమా ముఖ్య కారణం. ఐతే ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్టయి.. తెలుగులోనూ బాగా ఆడడం పెద్ద గొప్పేమీ కాదు. తమిళంలో అప్పటికే రజినీ సూపర్ స్టార్. తెలుగులో కూడా పాపులర్. కానీ ఒక భారతీయ సినిమా వేరే దేశంలో రిలీజ్ కావడమే గొప్పగా చెప్పుకునే రోజుల్లో జపాన్‌లో ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయడం.. అది అక్కడి స్ట్రెయిట్ చిత్రాలను మించి వసూళ్ల ప్రభంజనం సాగించడం ఒక పెద్ద సంచలనం అనే చెప్పాలి.
ఇప్పుడు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు ప్రపంచ స్థాయిలో అప్పటికే మంచి పాపులారిటీ తెచ్చుకుని, భారీ వసూళ్లు సాధించాక.. జపాన్‌లో గట్టిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు రాబట్టాయి. కానీ సోషల్ మీడియా అన్నదే లేని రోజుల్లో, ఒక తమిళ చిత్రాన్ని జపనీస్‌లో రిలీజ్ చేస్తే ఆ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం అనూహ్యం.
‘బాహుబలి’కి అంత పబ్లిసిటీ చేసినా.. ఆ సినిమాకు అక్కడ భారీ రిలీజ్, హౌస్ ఫుల్ వసూళ్లు వచ్చినా.. ఫుల్ రన్లో సాధించిన వసూళ్లు 300 మిలియన్ యాన్‌లు. ఇదేమీ చిన్న నంబర్ కాదు. భారీ వసూళ్లే సాధించినట్లు లెక్క. ఐతే కరెన్సీ విలువ బాగా పడిపోయి, టికెట్ల ధరలు ఎంతో పెరిగిన రోజుల్లోనే ‘బాహుబలి’ ఈ వసూళ్లు రాబట్టింది.
ఇప్పుడు తొలి వారంలో ‘ఆర్ఆర్ఆర్’ 73 మిలియన్ యాన్‌ల కలెక్షన్లు తెచ్చింది. ఈ ఫిగర్స్ చూసి ఔరా అనుకుంటున్నాం. కానీ పాతికేళ్ల ముందు ‘ముత్తు’ అనే సినిమా జపాన్‌లో ఏకంగా 400 మిలియన్ యాన్‌లు కలెక్ట్ చేసిందంటే ఆ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో ఒక రాష్ట్రంలో విడుదలైన లోకల్ మూవీ.. జపాన్‌లో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం, సూపర్ స్టార్ రజినీకి కోట్ల మంది అభిమానులను సంపాదించి పెట్టడం ఎప్పటికీ నిలిచిపోయే చరిత్ర అనడంలో సందేహం లేదు.
This post was last modified on October 30, 2022 5:48 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…