కాంతార OTT షాక్ ఇవ్వనుందా

ఒక సినిమా హిట్టవ్వాలంటే అంచనాల కన్నా ఎక్కువగా బలమైన కంటెంట్ ఉండాలని నిరూపించిన సినిమా కాంతార. కన్నడతో ధీటుగా ఇతర భాషల్లోనూ వసూళ్ల సునామి సృష్టిస్తున్న ఈ విలేజ్ బ్లాక్ బస్టర్ ప్రస్తుతం 250 కోట్ల గ్రాస్ కు అతి దగ్గరలో ఉంది. ఇది చదివే టైంకి బహుశా దాటేసినా ఆశ్చర్యం లేదు.

ఒక్క తెలుగు వెర్షన్ నుంచే ఇప్పటికే 18 కోట్లకు పైగా షేర్ వచ్చేసింది. ఇంకో పది రోజుల దాకా రన్ కొనసాగే అవకాశం ఉంది. ప్రధాన కేంద్రాల్లో వీకెండ్స్ ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు పడుతూనే ఉన్నాయి. వైజాగ్ లో నిన్న కొత్త మల్టీప్లెక్స్ ఓపెన్ చేస్తే కాంతారకే హయ్యెస్ట్ కలెక్షన్ వచ్చింది.

సరే ఇంత సంచలనం రేగినప్పుడు సహజంగానే ఓటిటిలో ఎప్పుడు వస్తుందనే ఆసక్తి కలుగుతుంది. దానికి తగ్గట్టే కాంతార డిజిటల్ ప్రీమియర్ అతి త్వరలో అది కూడా నవంబర్ 4 లేదా 5న ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్.

దీని గురించి అడిగినప్పుడు నిర్మాత విజయ్ కిర్గన్ దూర్ అలాంటి ప్లాన్ ఏది లేదని ఒకవేళ కన్ఫర్మ అయితే ప్రకటిస్తామని చెప్పారు. అలా అని ఈ మాటలను పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30నే రిలీజయ్యింది. అంటే వచ్చే నెల ప్రారంభానికి అయిదు వారాలు పూర్తవుతాయి. ప్రైమ్ అగ్రిమెంట్లు సాధారణంగా ఈ టైం స్పాన్ తోనే ఉంటాయి

దానికి తోడు అమెజాన్ ఓటిటి ఎప్పుడు ఇలాంటి పెద్ద హిట్లని గుట్టుచప్పుడు కాకుండానే స్ట్రీమింగ్ చేస్తుంది. కెజిఎఫ్ 2, పొన్నియన్ సెల్వన్ 1, సర్కారు వారి పాట డేట్లు లీకైనప్పుడు ముందు ఎవరూ నమ్మలేదు. కానీ 199 రూపాయల ధర పెట్టేసి లైవ్ లో ఉంచేశారు. కాంతారకు అలా చేసే ఛాన్స్ ని కొట్టిపారేయలేం. ఒకవేళ అదే జరిగితే ప్రైమ్ డబ్బులు అదనంగా తీసుకున్నా తీసుకోకపోయినా మిలియన్ల వ్యూస్ వెల్లువలా వచ్చి పడతాయి. పుష్ప 1 థియేటర్లలో స్ట్రాంగ్ గా రన్ అవుతున్నప్పుడే ఇరవై రోజులకు వదిలేసిన ట్రాక్ రికార్డు ప్రైమ్ ది. మరి కాంతారకూ అదే రిపీట్ అవుతుందా చూద్దాం