Movie News

పిఎస్ 1 ఓడిపోయింది అందుకే

తమిళంలో ఎంత నెత్తిన బెట్టుకున్నా, ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు 400 కోట్లు దాటాయని అఫీషియల్ గా చాటినా పొన్నియన్ సెల్వన్ 1 తెలుగులో ఇప్పటిదాకా బ్రేక్ ఈవెన్ అందుకోలేదని ట్రేడ్ టాక్. కేవలం 10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో బరిలో దిగిన ఈ పీరియాడిక్ డ్రామా మొదటి రెండు మూడు రోజులు బాగానే రాబట్టినప్పటికీ దసరాకు వచ్చిన టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల దెబ్బకు నెమ్మదిగా తగ్గుతూ పోయి ఫైనల్ గా క్లోజింగ్ రన్ కు వచ్చేసింది. ఇక్కడ దీని మీద డివైడ్ టాక్ వచ్చినప్పుడు కోలీవుడ్ రివ్యూయర్లు ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా మన ప్రేక్షకుల టేస్ట్ మీద ఘాటు కామెంట్లు చేశారు.

ఇప్పుడు కాంతార సక్సెస్ ని కళ్లారా చూశాక ఎవరికీ నోటమాట రావడం లేదు. ఏపీ తెలంగాణలో రెండు రోజులకే అయిదు కోట్ల షేర్ రాబట్టడం చూసి కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఇదే హోంబాలే సంస్ధ షాక్ తింది. మరి పొన్నియన్ సెల్వన్ ని రిసీవ్ చేసుకోలేని తెలుగు జనాలు కాంతారను ఎందుకంత ఓన్ చేసుకున్నారనే ప్రశ్నకు విశ్లేషణ చేసుకోవడం చాలా అవసరం.

మణిరత్నం టెక్నికల్ గా ఎంత గొప్ప స్టాండర్డ్ లో పీఎస్ 1 తీసినప్పటికీ అందులో గ్రాండియర్ ఉన్నంత గొప్పగా ఎమోషన్ లేదు. పైగా తమిళులకు మాత్రం పరిచయమున్న చోళుల నేపధ్యాన్ని గ్లోబల్ ఆడియన్స్ ని కనెక్ట్ చేయలేక కన్ఫ్యూజ్ చేశారు.

దీంతో ఇప్పుడీ ఫలితం దక్కింది. మణిరత్నం లాంటి లెజెండ్ ని రిషబ్ శెట్టి అనే అప్ కమింగ్ హీరో కం దర్శకుడు అధిగమించడమంటే మాటలు కాదు. పైగా పొన్నియన్ సెల్వన్ లో ఉన్న రాజప్రాసాదపు కుట్రల నేపధ్యం కానీ, ఇండస్ట్రీలో స్టార్ల కలయిక కానీ కాంతారలో లేవు. అయినా కూడా శాండల్ వుడ్ క్రియేటివిటీకి ఇక్కడ బ్రహ్మరథం దక్కుతోంది. ఓవర్సీస్ లోనూ మాములు దూకుడు చూపించడం లేదు. ఈ లెక్కన పొన్నియన్ సెల్వన్ 2కి అరవంలో భీభత్సమైన క్రేజ్ రావొచ్చేమో కానీ మనదగ్గర మాత్రం సాధారణ అంచనాలతోనే మొదలవుతుంది. దాంట్లో ఏం చేయబోతున్నారో లెట్ వెయిట్ అండ్ సీ.

This post was last modified on October 18, 2022 6:47 am

Share
Show comments
Published by
Satya
Tags: Ps1

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

8 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

10 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

10 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

11 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

12 hours ago