కొందరు ప్రముఖులు తమ తీరుతో సామాన్యుల మనసుల్ని గెలుచుకుంటారు. తాజాగా అలాంటి పనే చేశారు సీనియర్ నటుడు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తాజాగా తన అభిమాని ఇంట్లో జరిగిన పెళ్లికి హాజరై సందడి చేశారు. తమను అభిమానించే వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకొని మరీ వారింట్లో జరిగే వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో తాను ఒకడినన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించారు బాలయ్య.
అనంతపురం జిల్లా బాలయ్య అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తుంటారు గౌస్ మొహిద్దిన్. ఆయన కుమార్తె పెళ్లికి బాలక్రిష్ణ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఆయన రాకతో పెళ్లింట సందడి వాతావరణం నెలకొంది. పెళ్లి జరిగే వేదిక వద్దకు వచ్చిన బాలయ్య.. సంప్రదాయ టోపీని ధరించి పెళ్లికొడుకును ఆశీర్వదించారు. అంతేకాదు.. తన అభిమాని తల్లి వద్దకు వెళ్లి ఆమెను పలుకరించడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
అనంతరం తన అభిమాని కుమార్తె కమ్ పెళ్లికూతురు వద్దకు వెళ్లి.. సంప్రదాయ పద్దతిలో ఆమెకు గంధం పూసి ఆశీర్వదించారు. అభిమాని పెళ్లికి వెళ్లటమంటే.. అలా వెళ్లామా? కనిపించామా.. తిరిగి వెళ్లిపోయామా? అన్నట్లు కాకుండా ఇంట్లో ఒక వ్యక్తిగా బాలయ్య వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకోవటమే కాదు.. మనసును దోచేసింది. పెళ్లికి వచ్చిన బాలయ్య కారణంగా ఆయన్ను అమితంగా అభిమానించే అభిమాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తాము ఆరాధించే ప్రముఖులు.. తమ ఇంట్లో జరిగే వేడుకులకు హాజరైతే ఆ సీనే వేరుంటుందన్నది మరోసారి రిపీట్ అయ్యిందని చెప్పక తప్పదు.
This post was last modified on October 17, 2022 1:08 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…