శ్రీయ సడన్ గా ఇలా రెచ్చిపోతుందేమిటి?

40 ఏళ్ళు పైబడ్డాయ్. ఆల్రెడీ ఒక పాపకు తల్లైంది కూడా. అయితే ఇవేమీ గ్లామరస్ రోల్స్ చెయ్యడానికి అడ్డంకి కాదని ఇప్పటికే కరీనా కపూర్ వంటి హీరోయిన్లు ప్రూవ్ చేశారు. బహుశా అందుకేనేమో, ఇప్పుడు మాజీ హీరోయిన్ శ్రీయ సరన్‌ కూడా అదే రూట్లో పరిగెడుతోంది. గత రెండు రోజుల నుండి తన గమ్మత్తయిన ఫోటోలతో మతులు పోగొడుతోంది. ఇప్పుడున్న పెద్ద పెద్ద స్టార్ హీరోలందరితోనో ఒకప్పుడు జతకట్టేసిన శ్రీయ, ఇప్పుడు సడన్ గా ఇలా రెచ్చిపోవడానికి కారణమేంటబ్బా?

తమిళనాట బాగా పాపులర్ అయిన ఒక ఫోటోగ్రాఫర్ తో బాగా ఘాటైన షూట్ ఒకటి చేయించుకుని దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది శ్రీయ. ఈ అమ్మడు సడన్ గా రెచ్చిపోవడంతో చూపరులు కూడా ఖంగుతింటున్నారులే. అయితే ఉన్నటుండీ ఈ అందాల ఒలకబోత ఎందుకంటే.. డిజిటల్ మరియు ఓటిటి యుగం కంటే ముందే చాలా బాషల్లో నటించేసిన శ్రీయ, ఈ కొత్త ఫార్మాట్ వచ్చాక సినిమాలు పట్టుకోలేకపోవడమే అందుకు కారణం అనిపిస్తోంది. ఫారిన్ పిల్లోడ్ని పెళ్ళిచేసుకొని చాలారోజులు సినిమాలకు దూరంగా ఉండి, ఆ తరువాత చాలావరకు డీ-గ్లామ్ పాత్రలకే అంకితమైంది. ఆమె అందాల ఆరబోత పొయ్యదనో, లేకపోతే అలాంటి పాత్రలకు సెట్టవ్వదనో మనోళ్ళు అలాంటి ఆఫర్లేవీ ఇవ్వలేదనుకుంట. బహుశా అందుకేనేమో ఇప్పుడిలా వేడి వేడి వడ్డనతో ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

ఈ మధ్య కాలంలో 40 దాటిన మీరా జాస్మిన్ కూడా ఇదే తరహాలో ఇనస్టాగ్రామ్ లో రెచ్చిపోతోంది. మరి ఈ భామలకు మన డైరక్టర్లు పిలిచి గ్లామరసం పండించే రోల్స్ ఆఫర్ చేస్తారా? లేదంటే కేవలం వాళ్ళ ఇనస్టా ఫోటోలకు లైకులు కొట్టేసి చేతులు దులిపేసుకుంటారా అనేది తెలియాలంటే.. కొంతకాలం ఆగాల్సిందే.