‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన రెండు చిత్రాలు సాహో, రాధేశ్యామ్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయినా అతడి ఊపేమీ తగ్గలేదు. ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే, సలార్ లాంటి భారీ చిత్రాలను లైన్లో పెట్టిన యంగ్ రెబల్ స్టార్.. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే హార్రర్ కామెడీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
పక్కా కమర్షియల్ లాంటి డిజాస్టర్ తీసిన మారుతితో సినిమా వద్దని ప్రభాస్‌ను అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఎంతగా వేడుకున్నా.. మారుతిని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేసినా.. ఈ ప్రాజెక్టు ఆగలేదు. కొన్ని వారాల కిందటే చడీచప్పుడు లేకుండా ఈ సినిమా ముహూర్త కార్యక్రమం పూర్తి చేసుకుంది. ప్రభాస్ వీలును బట్టి రాబోయే రోజుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు. ప్రస్తుతం స్క్రిప్టును పక్కాగా తీర్చుదిద్దుకోవడంతో పాటు ప్రి ప్రొడక్షన్ పనుల మీద దృష్టిసారించాడు మారుతి.
గత కొన్ని రోజుల నుంచి సినిమాలో ముఖ్య పాత్రలకు నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్లే వివిధ భాషల నటీనటులను ఎంచుకున్నట్లు సమాచారం. ఇందులో విలన్ పాత్రకు బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ పేరును పరిశీలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే బాహుబలిలో కట్టప్పగా ప్రభాస్ కలయికలో గొప్ప పాత్ర చేసిన తమిళ నటుడు సత్యరాజ్ కూడా ఈ చిత్రంలో నటించనున్నాడట.
మారుతి గత రెండు చిత్రాలు పక్కా కమర్షియల్, ప్రతి రోజూ పండగేల్లోనూ ఆయన కీలక పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త సినిమాలో ప్రభాస్ తాతగా సత్యరాజ్ నటించనున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో ఒక కథానాయికగా మాళవిక మోహనన్ ఖరారైనట్లు ఇంతకుముందే వార్తలొచ్చాయి. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సలార్, ప్రాజెక్ట్-కే చిత్రాల్లో నటిస్తూనే అప్పుడప్పుడూ కొన్ని డేట్లను ప్రభాస్ ఈ సినిమా కోసం కేటాయించనున్నాడు.
This post was last modified on September 28, 2022 2:26 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…