Movie News

గాడ్ ఫాదర్ తండ్రిగా సిరివెన్నెల హీరో

బజ్ ఏ స్థాయిలో ఉందన్నది కాసేపు పక్కనపెడితే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కు సంబంధించి బయటికి చెప్పని ఎనో విశేషాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. యాంకర్ శ్రీముఖికి ప్రైవేట్ జెట్ లో విమానంలో ప్రయాణం చేస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పకొచ్చారు చిరు. ఆల్రెడీ పూరి జగన్నాధ్ ఇందులో జర్నలిస్ట్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కీలకమైన పాయింట్ ఏంటంటే ఒరిజినల్ వెర్షన్ లో యుట్యూబర్ పాత్రనే ఇందులో మన ఆడియన్స్ కి తగ్గట్టుగా కొంత మార్చారట. ముందు భయపడినా తర్వాత చాలా బాగా చేశాడని కితాబు ఇచ్చారు.

ఇక అసలు విషయానికి వస్తే గాడ్ ఫాదర్ సినిమా రాష్ట్ర సిఎం చనిపోవడంతో మొదలవుతుంది. లీడర్, భరత్ అనే నేను ఫ్లేవర్ లో అనిపించినా దీని ప్యాట్రన్ వేరే. ఆ ముఖ్యమంత్రిగా చేసింది సర్వదమన్ బెనర్జీ. నిన్నటి తరం యూత్ కి ఇతను గుర్తే కానీ ఇప్పటి జెనరేషన్ కు మాత్రం కొంత విడమరిచి చెప్పాలి. 1986లో కళాతపస్వి కె విశ్వనాథ్ ఆవిష్కరించిన అద్భుతం సిరివెన్నెలలో అంధుడిగా పరిచయమయ్యింది ఇతనే. సుహాసిని లాంటి సీనియర్ తో పోటీ పడి ఆ క్యారెక్టర్ కు ప్రాణం పోసిన తీరు ఎన్నో అవార్డులను తీసుకొచ్చింది. ఈ గాలి ఈ నెల పాట వినిపిస్తే చాలు మెదిలేది ఈయన రూపమే.

తర్వాత 1987లో అదే విశ్వనాథుల డైరెక్షన్ లో స్వయంకృషి చేశారు. సుమలత భర్తగా కనిపించేది ఎక్కువ కాకపోయినా మంచి గుర్తింపు వచ్చింది. కట్ చేస్తే కృష్ణ, ఓం నమః శివాయ లాంటి టీవీ సీరియల్స్ లో నటించడం తప్ప వెండితెరకు దూరమయ్యాడు. ముప్పై అయిదు సంవత్సరాల తర్వాత తిరిగి గాడ్ ఫాదర్ తోనే టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంటే హీరోకు తండ్రన్న మాట. సర్వదమన్ భార్యల సవతి బిడ్డలుగా చిరంజీవి, నయనతార కనిపిస్తారు. మెగాస్టార్ కు తన సమకాలీకుల్లో చంద్రమోహన్ ఇద్దరు మిత్రుల్లో ఫాదర్ గా కనిపిస్తే ఇప్పుడీ బెనర్జీ అదే సీన్ రిపీట్ చేస్తున్నారు.

This post was last modified on September 26, 2022 7:13 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

32 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago