ఈ హెడ్డింగ్ చూసి ఏదో ఊహించుకోకండి. ఇదేదో మందుకొట్టే వ్యవహారం గురించిన ప్రశ్న కాదు. ఆమె సొగసు గురించి అందరూ ఆశ్చర్యపోతూ సోషల్ మీడియాలో వేస్తున్న ప్రశ్న ఇది. ఎంత అందమైన హీరోయిన్లయినా థర్టీస్‌లోకి రాగానే కొంతమేర ఆకర్షణ కోల్పోతుంటారు. ఇక ఫార్టీస్‌లోకి వచ్చారంటే అంతే సంగతులు. ఆ వయసు వాళ్లను అసలు హీరోయిన్లుగా పరిగణించరు. అందం, ఆకర్షణ తగ్గిపోయి లుక్ తేడా కొట్టేస్తుంటుంది. కానీ త్రిష మాత్రం 40 ఏళ్ల వయసులో మెరిసిపోతున్న తీరుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
అలా అని ఎప్పుడూ ఆమె అంతే ఆకర్షణీయంగా ఉందనుకుంటే పొరబాటే. కొన్నేళ్ల ముందు ఆమెను చూసి ఇక తన పనైపోయిందని అంతా అనుకున్నారు. ముఖంలో గ్లో తగ్గిపోయింది. తన సినిమాలు కూడా వరుసగా బోల్తా కొట్టాయి. తన స్థాయికి తగని సినిమాలతో త్రిష అభిమానులను నిరాశ పరిచింది. అదే సమయంలో పెళ్లికి కూడా సిద్ధం కావడంతో ఆమె కథ ముగిసిందనే నిర్ణయానికి వచ్చేశారు.
ఐతే వరుణ్ మణియన్‌తో చేసుకున్న నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని.. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న త్రిష.. ఆ గ్యాప్ తర్వాత మళ్లీ జాగ్రత్తగా సినిమాలు ఎంచుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి భారీ చిత్రంలో అవకాశం దక్కింది. ఇందులో ముఖ్య పాత్ర కోసం ఏం కసరత్తులు చేసిందో ఏమో కానీ.. పోస్టర్లు, టీజర్, ట్రైలర్లలో తనను చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వివిధ నగరాల్లో తిరుగుతున్న త్రిషను చూసి ఫిదా అయిపోతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో త్రిష లుక్, తన అప్పీయరెన్స్ చూసి మెస్మరైజ్ కాని వాళ్లు లేరు. వయసు పెరుగుతుంటే ముందుకంటే ఇంకా అందంగా తయారవడం త్రిషకే చెల్లిందని.. ఆమె అమృతం లాంటిదేమైనా తాగుతోందేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్లో మీడియాతో, అభిమానులతో త్రిష మాట్లాడిన తీరు పట్ల కూడా ప్రశంసలు కురిశాయి.
This post was last modified on September 26, 2022 3:03 pm
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…