ఆస్కార్ అవార్డుల పంట పండించుకున్న స్లమ్ డాగ్ మిలియనీర్ అనే సినిమా గుర్తుందా? దీన్ని గుర్తు తెచ్చేలా తెలుగులో ఇప్పుడు స్లమ్ డాగ్ హజ్బెండ్ అనే కొత్త సినిమా ఒకటి తెరకెక్కుతోంది. ఇందులో బ్రహ్మాజీ తనయుడు, పిట్టకథ ఫేమ్ సంజయ్ రావు హీరోగా నటిస్తున్నాడు. ప్రణవి అనే కొత్తమ్మాయి కథానాయిక.
ఏఆర్ శ్రీధర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి కొత్తగా ఒక పాట రిలీజ్ చేశారు. లచ్చిగాని పెళ్లి అంటూ సాగే ఈ పాటను మాస్ రాజా రవితేజ విడుదల చేయడం విశేషం. ఈ పాట లాంచింగ్ సందర్భంగా బాగానే హడావుడి జరిగింది. ఐతే ఇలా హడావుడి చేసినంత మాత్రాన పాట జనాల్లోకి వెళ్లిపోదు. పాటలో దమ్ముండాలి. ఊపుండాలి.
ఆ లక్షణాలన్నీ ఉన్న లచ్చిగాని పెళ్లి త్వరలో సోషల్ మీడియాలో వైరల్ అయితే ఆశ్చర్యమేమీ లేదు. బుల్లెట్ బండి తరహాలో మంచి ఊపుతో సాగే ఈ పాట అచ్చమైన హైదరాబాదీ మాస్ బీట్‌తో సాగుతూ ఒక ఊపేసేలా కనిపిస్తోంది. ఇలాంటి పాటలకు పెట్టింది పేరైన కాసర్ల శ్యామ్ క్యాచీ పదాలతో పాట రాయగా.. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఊపున్న ట్యూన్ చేశాడు.
స్వయంగా పాటను ఆలపించాడు. చాలా ఈజీగా జనాల్లోకి వెళ్లిపోయి పెళ్ళిళ్ళలో, ఇతర వేడుకల్లో మార్మోగేలా కనిపిస్తోంది ఈ పాట. జీతు అనే డ్యాన్స్ మాస్టర్ ఈ పాటకు స్టెప్స్ కంపోజ్ చేయడమే కాక.. తనే స్వయంగా పాటలో నర్తించాడు. ఈ పాట వైరల్ అయితే సినిమాకు ఆటోమేటిగ్గా బజ్ క్రియేట్ అవుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on September 22, 2022 7:09 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…