లాక్ డౌన్ రీమేకులు వర్కవుట్ అవుతాయా?

లాక్ డౌన్ వల్ల సినిమా ప్రియులు పర భాషా చిత్రాలు చూడడం ఎక్కువయింది. ఎప్పుడూ తెలుగు సినిమాల గురించి తప్ప ఇతర భాషా సినిమాలను పట్టించుకోని తెలుగు సినిమా మీడియా కూడా ఓటిటీలో దొరుకుతోన్న వేరే భాషల సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తోంది. ఓటిటి పుణ్యమా అని పర భాషా చిత్రాలను చూసేందుకు అగచాట్లు పడే పని లేదు. ఎంచక్కా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సహా దొరికేస్తున్నాయి. నెట్ కనెక్షన్ ఉండి, సినిమాల మీద అమితాసక్తి ఉన్న ఎవరికైనా ఇప్పుడు సో అండ్ సో సినిమా అంటే తెలియకుండా ఉండదు.

ఈ నేపథ్యంలో సదరు పర భాషా సినిమాలను ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేస్తే వర్కౌట్ అవుతాయా? రూరల్ ఆడియన్స్ కి సదరు ఓటిటి సినిమాలు రీచ్ కాకపోవచ్చు. కానీ వాటి టార్గెట్ ప్రధానంగా నగర యువత. వాళ్ళలో ఎక్కువ శాతం ఈ లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాలు కవర్ చేసేస్తున్నారు. మరి మలయాళ సినిమాలు కానీ, వేరే ఏ భాషలోని పాపులర్ సినిమా కానీ రీమేక్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా?