సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా గురించి చర్చ ఇప్పటిది కాదు. దాదాపు దశాబ్దంన్నర కిందట వీరి మధ్య కథా చర్చలు జరిగాయి. స్వయంగా మహేష్ బాబే రాజమౌళి దర్శకత్వంలో సినిమా గురించి అప్పట్లో హింట్ ఇచ్చాడు. కానీ రకరకాల కారణాల వల్ల వీరి కాంబో అప్పుడు సెట్ కాలేదు.
ఐతే దీని గురించి మహేష్ ఫ్యాన్స్ మరీ బాధ పడాల్సిన పని అయితే లేదు. అప్పుడు జక్కన్నతో మహేష్ సినిమా చేస్తే అది మామూలుగానే ఉండేదేమో. కానీ ఇప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో రాజమౌళి పేరు ప్రపంచ స్థాయిలో మార్మోగాక, ఆయన సినిమాలకు మినిమం వెయ్యి కోట్ల వసూళ్లు వచ్చే పరిస్థితుల్లో తనతో జట్టు కడుతున్నాడు సూపర్ స్టార్.
దీంతో ఈ కాంబినేషన్ మీద అంచనాలు మామూలుగా లేవు. వీరి కలయికలో రాబోయే సినిమా గురించి ఏ చిన్న కబురు వినిపించినా అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. తాజాగా టొరంటో ఫిలిం ఫెస్టివల్‌కు అతిథిగా హాజరమైన రాజమౌళి.. మహేష్‌తో తాను చేయబోయే సినిమా గురించి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
మహేష్‌తో తన సినిమా గురించి మాట్లాడుతూ.. globetrotting action adventure అని వ్యాఖ్యానించాడు జక్కన్న. ఆయనీ మాట అనగానే.. globetrotting అంటే ఏంటి అంటూ డిక్షనరీల మీద పడిపోయారు మహేష్ ఫ్యాన్స్. ఈ పదానికి ‘పంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందే’ అని అర్థమట. అంటే ఈ సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో ఉంటుందని జక్కన్న చెప్పకనే చెప్పినట్లయింది. ఇక యాక్షన్ అడ్వెంచర్ అని రాజమౌళి అనడాన్ని బట్టి ఇది ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్లే ఆఫ్రికా అడవుల్లో సాగే కథ అయి ఉండొచ్చని, ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉన్నా ఆశ్చర్యం లేదని అనుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates