2010లో ఆవారా, నా పేరు శివ వరస హిట్లతో తెలుగులోనూ మార్కెట్ స్థిరపరుచుకున్న కార్తీకి అప్పటి నుంచి రెండు భాషల్లో ఒకేసారి రిలీజులు ఉంటున్నాయి. ఫలితంతో సంబంధం లేకుండా ఇలా జరిగేలా హక్కులు ఇవ్వడం ద్వారా నిర్మాతలు అలా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. మధ్యలో నేటివిటీ సమస్య వల్ల మద్రాస్ లాంటివి మిస్ అయ్యాయి కానీ దాదాపు అన్నీ ఒకే టైంలో వచ్చేలా కార్తీ జాగ్రత్త పడ్డాడు. కానీ ఇటీవలే రిలీజైన విరుమన్ కు మాత్రం అది సాధ్యపడలేదు. ఆ సమయంలో కార్తికేయ 2, మాచర్ల నియోజకవర్గం విడుదలతో పాటు సీతారామం, బింబిసారలు స్ట్రాంగ్ గా ఉండటం వల్ల కుదరలేదు.
అక్కడ కమర్షియల్ గా విరుమాన్ బాగానే ఆడింది. రొటీన్ విలేజ్ డ్రామానే అయినప్పటికీ బిసి సెంటర్స్ జనం ఆదరించారు. తెలుగులో అయితే ఆ స్థాయి ఫలితం దక్కేది కాదేమో. ఇలా ఎదురు చూస్తుండగానే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో వచ్చేస్తోంది. సెప్టెంబర్ 11న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఓటిటి వర్గాల టాక్. అఫీషియల్ ప్రకటన రేపో ఎల్లుండో వచ్చేస్తుంది. ముత్తయ్య దర్శకత్వం వహించిన విరుమన్ లో ప్రకాష్ రాజ్, రాజ్ కిరణ్, అదితి శంకర్, సూరి తదితరులు నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. రెండు భాషల్లో మార్కెట్ ఉన్న హీరోలు ఇలా ఒక చోట్ల ఆలస్యం చేయడం వల్ల థియేట్రికల్ బిజినెస్ తగ్గడమే కాదు సదరు ఒరిజినల్ వెర్షన్ ని ముందే ఓటిటిలో చూసేయడం వల్లో లేదా రివ్యూలు చదవడం వల్లో హాలు దాకా రాకుండా పోయే ప్రమాదం ఉంది. కార్తీ నుంచి ఇది మిస్ అయినా తన టాలీవుడ్ ఫ్యాన్స్ కోసం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, సర్దార్ లు బిగ్ స్క్రీన్ మీదే రాబోతున్నాయి. వీటికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు, హక్కుల అమ్మకాలు దాదాపు పూర్తయ్యాయట.
This post was last modified on September 7, 2022 6:47 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…