Movie News

తిరు ఖాతాలో 100 కోట్లు

సినిమాలో కంటెంట్ ఉంటే పబ్లిసిటీ పెద్దగా చేయకపోయినా ఆడియెన్సే నెత్తినబెట్టుకుంటారని చెప్పడానికి ధనుష్ తిరు (తమిళంలో తిరుచిత్రాంబలం) మంచి ఉదాహరణగా నిలుస్తోంది. సైలెంట్ గా పెద్ద సౌండ్ లేకుండా వచ్చిన ఈ యూత్ కం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూడో వారంలోకి అడుగు పెట్టకుండానే ఒరిజినల్ వెర్షన్ నుంచి 100 కోట్ల గ్రాస్ ని అందుకుని ఆశ్చర్యపరిచింది. తెలుగులో భారీ బిజినెస్ చేయకపోయినా అమ్మిన రేట్లకు మించిన లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తోంది. మొన్న వీకెండ్ లో చాలా చోట్ల మంచి ఆక్యుపెన్సీ నమోదు చేసింది. దీనికంతా కారణం కేవలం మౌత్ టాకే

మరో విశేషం ఏంటంటే ఇది ధనుష్ మొదటి హండ్రెడ్ క్రోర్ మూవీ. గతంలో వడ చెన్నై, కర్ణన్, అసురన్ లాంటివి గొప్ప సక్సెస్ సాధించినా ఆ మార్కును అందుకోలేకపోయాయి.అందుకే ధనుష్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉన్నా విజయ్, అజిత్, మావయ్య రజినీకాంత్ సరసన టైర్ వన్ లీగ్ లోకి చేరలేకపోయాడు. ఇప్పుడిలాంటి తిరులు ఇంకో రెండు మూడు పడితే అదేం పెద్ద విషయం కాదు. ఇటీవలే ది గ్రే మ్యాన్ తో నెట్ ఫ్లిక్స్ ద్వారా హాలీవుడ్ డెబ్యూ చేసిన ధనుష్ కు దాని ఫలితం నిరాశపరిచింది. పాత్రపరంగా కనీస గుర్తింపు దక్కకపోయినా రస్సో బ్రదర్స్ డైరెక్షన్ లో చేసిన సంతృప్తి మిగిలింది.

తిరుకి టాలీవుడ్ లో పబ్లిసిటీ లోపం జరగడానికి కారణం లేకపోలేదు. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కు గత రెండు సినిమాలు పెద్దన్న, ఈటి తెలుగులో చేదు అనుభవాలు మిగిల్చాయి. అందుకే తిరు విషయంలో హడావిడి చేయకుండా సింపుల్ గా వదిలేశారు. కనీసం ప్రకాష్ రాజ్, నిత్య మీనన్ లతో స్వంతంగా డబ్బింగ్ చెప్పించే ప్రయత్నాలు కూడా చేయలేదు. అయినా జనం క్షమించి చూశారు. ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రోమోలు,  ఇంటర్వ్యూలు, మేకింగ్ వీడియోలంటూ ఏదైనా హంగామా చేసుంటే ఖచ్చితంగా రీచ్ పెరిగేది. లైగర్ ఫెయిలైన అవకాశాన్ని వాడుకుని ఉండేది. ఛాన్స్ మిస్ అయినట్టే. 

This post was last modified on September 7, 2022 6:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

36 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

59 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago