మామా అల్లుడి కాంబో ఇంకెప్పుడు

జనసేన కార్యకలాపాలు ఊపందుకున్నాక పవన్ కళ్యాణ్ సినిమాలు ఏవి ఎప్పుడు ఎలా పూర్తవుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. హరిహరవీరమల్లు చిన్న టీజర్ ఇచ్చి టెన్షన్ తగ్గించారు కానీ ఖచ్చితంగా ఫలానా తేదీకి రిలీజ్ చేస్తామని మాత్రం ఖరాఖండిగా చెప్పలేకపోయారు. కాకపోతే ఆగిపోయింది ఆలస్యమవుతుందనే పుకార్లకు చెక్ పెట్టగలిగారు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎప్పుడో స్క్రిప్ట్ లాక్ చేసిన భవదీయుడు భగత్ సింగ్ అదిగో పులి సామెతను గుర్తు చేస్తోంది. ఫ్యాన్స్ కి ఎలివేషన్ ఇచ్చేలా డైరెక్టర్ గారు ట్వీట్లు పెడుతూనే ఉన్నారు.

సరే వీటి సంగతి కాసేపు పక్కనపెడితే తక్కువ కాల్ షీట్లతో ప్లాన్ చేసుకున్న వినోదయ సితం రీమేక్ సైతం బాగా లేట్ అవ్వొచ్చని మెగా కాంపౌండ్ టాక్. ఇరవై రోజుల్లో పవన్ కాల్ షీట్స్ ఇస్తే చాలని దానికి తగ్గట్టే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకునేలా ముందుగానే హోమ్ వర్క్ చాలా జరిగింది. దీని కోసమే సాయి ధరమ్ తేజ్ కొత్తగా ఎవరికీ కమిట్ మెంట్లు ఇవ్వడం లేదు.

చినమావయ్యతో నటించే అరుదైన అవకాశాన్ని వదులుకునేందుకు రెడీగా లేడు. అయితే పవన్ మాత్రం ఏదీ తేల్చుకోలేకపోతున్నట్టు వినికిడి. త్రివిక్రమ్ ఫైనల్ వెర్షన్ ని సిద్ధం చేయించినా ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఒరిజినల్ వెర్షన్ టేకప్ చేసిన సముతిరఖనినే దీని బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయనేం ఖాళీగా లేరు.

ఆర్టిస్టుగా మూడు భాషల్లో చాలా బిజీగా ఉన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు వినోదయ సితంని తీయమంటే ఒప్పేసుకునే సీన్ లేదు. కనీసం నెల ముందుగా ప్లాన్ చేసుకుంటే తప్ప అవ్వదు. అసలు ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ అయిన మూవీని రీమేక్ చేయడం పట్ల ఇప్పటికే ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. అందుకే సాయితేజ్ కాంబో అన్నా పెద్దగా ఎగ్జైట్ మెంట్ కలగలేదు. వాళ్ళ దృష్టి మొత్తం హరిహరవీరమల్లు మీదే ఉంది. పవన్  ముందు దీన్ని పూర్తి చేసి తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోమని అభ్యర్థిస్తున్నారు. వింటారా