విక్రమ్.. ఈ పేరు చెబితే దక్షిణాది ప్రేక్షకలకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అతడి యాక్టింగ్ టాలెంట్, సినిమా కోసం అతను పడే కష్టం, తపన, అతను చేసిన అద్భుతమైన పాత్రలు గుర్తుకొచ్చి మంచి అనుభూతి కలుగుతుంది. అతడిపై ఆరాధన భావం కలుగుతుంది. ఎలాంటి నెగెటివిటీ లేకుండా అందరూ ఇష్టపడే నటుల్లో అతనొకడు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన అతను.. చాలా కష్టపడి ఎదిగిన వైనం అందరికీ తెలిసిందే.
‘సేతు’ దగ్గర్నుంచి అద్భుతమైన పాత్రలతో కొన్నేళ్లలోనే సౌత్ ఇండియాలోనే టాప్ హీరోల్లో ఒకడిగా ఎదిగాడు. సామి, శివపుత్రుడు, అపరిచితుడు.. ఇలా తక్కువ వ్యవధిలో ఒకదాంతో మరోదానికి పోలిక లేని పాత్రలు చేసి భారీ విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. ఆ టైంలో అతణ్ని చూసి సౌత్ ఇండియన్ సినిమాలో మరో కమల్ హాసన్ పుట్టాడనే వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ ఆ తర్వాత విక్రమ్ ప్రతిభను, సామర్థ్యాన్ని సరిగ్గా వాడుకుని సినిమా చేసిన దర్శకుడే లేడు.
విక్రమ్‌తో ‘అపరిచితుడు’ లాంటి అద్భుత చిత్రాన్ని తీసిన శంకర్ సహా ఎవ్వరూ అతడికి విజయాన్నివ్వలేకపోయారు. ఎలాంటి హీరోకైనా ఫ్లాపులు మామూలే కానీ.. మరీ 17 ఏళ్ల పాటు నిఖార్సయిన హిట్ అన్నదే లేకుండా ఒక స్టార్ హీరో కెరీర్‌ను కొనసాగించడం షాకింగ్ విషయమే. ‘ఐ’ సహా కొన్ని చిత్రాలకు ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి కానీ.. ఆ సినిమాలేవీ ప్రేక్షకులకు సంతృప్తిని మాత్రం మిగల్చలేకపోయాయి.
విక్రమ్ ఎన్ని ఫ్లాపులిచ్చినా సరే.. అతణ్ని తిట్టుకోవట్లేదు అభిమానులు. అలాగే అతడి మీద ఆశ కూడా కోల్పోవట్లేదు. ఇప్పటికీ తన సినిమాలకు రిలీజ్ ముంగిట హైప్ వస్తోంది. ఈసారైనా విక్రమ్ హిట్ కొడతాడు అని ఆశగా ఎదురు చూస్తున్నారు. తీరా సినిమా చూసి నిరాశ పడుతున్నారు. విక్రమ్ కొత్త చిత్రం ‘కోబ్రా’ విషయంలోనూ అదే జరిగింది.
17 ఏళ్ల పాటు సక్సెస్ లేకపోయినా ఈ సినిమాను భారీ బడ్జెట్లో తీసి, పెద్ద స్థాయిలో రిలీజ్ చేశారు. తమిళంలోనే కాక తెలుగులోనూ మంచి అంచనాల మధ్య సినిమా రిలీజైంది. ఆ అంచనాలను కాస్త కూడా అందుకోలేక చతికిలపడింది. తొలి రోజు మార్నింగ్ షోకే కింద పడ్డ సినిమా.. తర్వాత పైకి లేవలేదు. విక్రమ్ టాలెంటుకి, అతడిపై ప్రేక్షకుల్లో ఉన్న అభిమానానికి సరైన సినిమా పడితే ఇప్పటికీ సూపర్ సక్సెస్ అవుతుందన్నది ఖాయం. కానీ అతడి టాలెంటుని ఉపయోగించుకునే దర్శకుడే కనిపించకపోవడం విచారకరం.
This post was last modified on September 4, 2022 2:32 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…