పవన్-చరణ్-త్రివిక్రమ్.. ఇదైతే పక్కా!

Pawan Charan Trivikram

రామ్ చరణ్ తో ఇంతవరకు త్రివిక్రమ్ సినిమా చేయలేదు. ఎప్పట్నుంచో డిస్కషన్ లో ఉంది కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ కాంబినేషన్ లో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఫిక్సయ్యాడట. ఎన్టీఆర్ తో తదుపరి చిత్రం ఖరారు చేసుకున్న త్రివిక్రమ్ ఆ సినిమా తర్వాత పవన్ బ్యానర్లో చరణ్ తో సినిమా చేస్తాడు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథ సిద్ధం చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడట. ఎన్టీఆర్ చిత్రం కథ పూర్తవడంతో ఈ ఖాళీ టైంని త్రివిక్రమ్ ఇలా వాడుకుంటున్నాడు. మరి త్రివిక్రమ్ చేసే సినిమాలన్నీ ఇటీవల హారిక హాసిని క్రియేషన్స్లోనే రూపొందుతున్నాయి.

ఆ లెక్కన పవన్ నిర్మించే సినిమాకు వాళ్ళు భాగస్వాములుగా ఉంటారా లేదా అనేది తెలియదు. పవన్ మళ్ళీ నటించడం స్టార్ట్ చేసాక త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా ఉంటుందని ఫాన్స్ ఆశించారు. కానీ త్రివిక్రమ్ ఆర్.ఆర్.ఆర్. హీరోలకు కమిట్ అయి ఉన్నాడు కనుక పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం కొన్నేళ్ల నిరీక్షణ తప్పదు.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content