విక్రమ్ సినిమా అంటే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఒకసారైనా చూసేంత మ్యాటర్ ఉంటుందని మూవీ లవర్స్ బలంగా నమ్ముతారు. శంకర్ ఐ కమర్షియల్ రిజల్ట్ ఎంత నిరాశపరిచినా దానికి చియాన్ విక్రమ్ కష్టపడిన తీరు అభిమానులను కదిలించింది. ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతటి స్టార్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత బిగ్ స్క్రీన్ మీద రావడం కన్నా కిక్ ఇచ్చే విషయం ఏముంటుంది. అందుకే కోబ్రా రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు తెలుగులో పెద్ద సౌండ్ లేదు కానీ తమిళనాడులో మాత్రం అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి.
ఈ నేపథ్యంలో కోబ్రా ఏదైనా మేజిక్ చేయకపోదాని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు నిరాశపరిచాడు. తన గత రెండు చిత్రాలు డెమోంటీ కాలనీ, అంజలి సిబిఐ చూసినవాళ్లు కోబ్రాలో కూడా అలాంటి కంటెంటే ఉంటుందని ఆశించారు. అయితే విక్రమ్ ని రకరకాల గెటప్పుల్లో చూపించేందుకు తాపత్రయపడిన అజయ్ దానికి తగ్గ కథాకథనాలు సమకూర్చుకోవడంలో తడబడటంతో మూడు గంటల నిడివి ఉన్న ఈ యాక్షన్ కం రివెంజ్ డ్రామా ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ల్యాగ్ విపరీతంగా ఉండటంతో ఫైనల్ గా అసంతృప్తి తప్పలేదు.
దశావతారంలో ఎప్పుడైతే కమల్ హాసన్ పది గెటప్పుల్లో తన విశ్వరూపాన్ని పీక్స్ లో చూపించాడో అప్పటి నుంచి దాన్ని మించిన ఫీట్ ఇంకొకరు చేయలేరనే అభిప్రాయం ప్రేక్షకుల్లో నాటుకుపోయింది. దాన్ని బ్రేక్ చేయాలనే ధృడ సంకల్పంతో విక్రమ్ ఈ కోబ్రాని ట్రై చేసినట్టు ఉంది కానీ మొత్తానికి ఏళ్లతరబడి తను పడిన కష్టానికి తగ్గ ఫలితం తెలుగులో అయితే దక్కేలా లేదు. ఓపెనింగ్స్ కూడా సోసోగానే ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించినప్పటికీ ఆ అంశం ఆడియన్స్ కి సరైన రీతిలో రిజిస్టర్ అవ్వలేదు. దానికి తగ్గట్టు ఆల్బమ్ కూడా సోసోగానే ఉండటంతో మొత్తానికి కోబ్రా కాటు విక్రమ్ ను మళ్ళీ ఎప్పుడు కోలుకునేలా చేస్తుందో.
This post was last modified on August 31, 2022 7:02 pm
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…