కేవలం విజయ్ దేవరకొండ తమ్ముడనే బ్రాండ్ తో ఇండస్ట్రీలో అవకాశాలు పట్టేస్తున్న ఆనంద్ దేవరకొండకు ఇంకా బలమైన థియేట్రికల్ మార్కెట్ ఏర్పడలేదు. అందుకే మిడిల్ క్లాస్ మెలోడీస్ ని ఓటిటికి ఇచ్చాక పుష్పక విమానంని హాళ్లలో వదిలితే ఆశించిన ఫలితం రాలేదు.తాజాగా హైవేని తిరిగి డిజిటల్ బాట పట్టించారు. 118, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యులతో దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ మూడో మూవీ ఇది. ట్రైలర్ కొంత ఆసక్తి రేపగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గట్టిగానే చేశారు. అంతో ఇంతో ప్రేక్షకుల్లో అంచనాలు లేకపోలేదు.
టైటిల్ హైవే అని పెట్టారు కానీ దానికి తగ్గ స్పీడ్ సినిమాలో లేకపోయింది. అనగనగా ఒక సైకో కిల్లర్. వయసులో ఉన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి నిర్మానుష ప్రదేశాలకు తీసుకెళ్లి దారుణంగా చంపేస్తూ ఉంటాడు. పోలీసులు ఎంత జుత్తు పీకున్నా వాడి ఆచూకీ దొరకదు. హీరోకేమో ఫోటోగ్రఫీ ప్యాషన్. ఓ జర్నీలో అమాయకురాలైన హీరోయిన్ ని చూసి మనసు పారేసుకుంటాడు. కట్ చేస్తే ఆమెను సైకో ఎత్తుకుపోతాడు. వాడి జాడను పట్టుకుని చివరికి ఎలా మట్టుబెట్టాడు, ప్రియురాలిని ఎలా విడిపించుకున్నాడనేదే స్టోరీ.
రాక్షసుడి తాలూకు ప్రభావమో లేక జనాలు ఓటిటిలో థ్రిల్లర్ లు చూడటం లేదన్న అభిప్రాయమో ఏమో కానీ కెవి గుహన్ ఎలాంటి ప్రత్యేకత లేని ఓ రొటీన్ సైకో సబ్జెక్టుని తీసుకుని నిరాశపరిచారు. హిందీ మలయాళంతో పాటు తెలుగులోనూ ఇలాంటివి బోలెడు వచ్చాయి. ఇంతోటి దానికి నిర్మాతలు ఎలా ఎగ్జైట్ అయ్యారో అర్థం కాదు. టెక్నికల్ వాల్యూస్ ఉన్నప్పటికీ కంటెంట్ వీక్ గా ఉండటంతో హైవే మీద ప్రయాణం బోల్తా పడింది. ఓటిటి కాబట్టి సరిపోయింది కానీ లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడం కష్టమే.
This post was last modified on August 20, 2022 2:04 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…