బాలయ్య – దిల్ రాజు ఏం జరిగింది ? 

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కి దిల్ రాజు కి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అనిల్ తో ఎక్కువ సినిమాలు నిర్మించింది దిల్ రాజునే. సుప్రీమ్ నుండి మొన్న వచ్చిన ‘F3’ వరకూ ఈ బంధం ఫైనాన్షియల్ గా కూడా కొనసాగింది. అంతెందుకు అనిల్ రావిపూడి మొదటి సినిమా ‘పటాస్’ తో కూడా దిల్ రాజు కి డిస్ట్రిబ్యూటర్ గా లింక్ ఉంది. అయితే ఇప్పుడు ఈ లింక్ కట్ అయింది.

అవును అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి దిల్ రాజు కి ఇప్పుడు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. బాలయ్య తో అనిల్ రావిపూడి తీయనున్న సినిమాను షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది. మధ్యలో అనిల్ లింక్ తో బాలయ్య సినిమాలో కూడా సాహు గారపాటి హరీష్ పెద్ది లతో పాటు పార్ట్నర్ గా ఉండే ప్రయత్నం చేశాడట దిల్ రాజు. కానీ అది వర్కౌట్ అవ్వలేదట. దీనికి రీజన్ నిర్మాతలే అని తెలుస్తుంది.

షైన్ స్క్రీన్ పై ఇప్పటి వరకూ ఓ బడా సినిమా రాలేదు. నాని , నాగ చైతన్య ఇలా మీడియం రేంజ్ హీరోలతో ఆ నిర్మాతలు సినిమాలు తీశారు. ఎట్టకేలకు అనిల్ ద్వారా బాలయ్య కి అడ్వాన్స్ ఇప్పించి NBK108 లాక్ చేసుకున్నారు. ఇప్పుడు దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ లో పార్ట్నర్ అయితే ఆయనదే పై చేయిగా ఉంటుంది. నిర్మాతలుగా వీళ్ళు డమ్మీ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా గమనించే రాజు గారిని మెల్లగా సైడ్ చేసి వాళ్ళే నిర్మించేందుకు రెడీ అయ్యారని ఇన్సైడ్ టాక్.

తాజాగా సినిమాను ఎనౌన్స్ చేసి ఓన్లీ షైన్ స్క్రీన్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. ఇక అనిల్ రావిపూడి ద్వారా దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ లోకి దూరెందుకు చివరి క్షణం వరకూ గట్టిగా ట్రై చేశారని ఓ భోగట్టా. కొన్నేళ్లుగా బాలయ్య తో దిల్ రాజు సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య తో ఎలాగైనా తన బేనర్ లో అలాంటి ఓ పవర్ ఫుల్ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఈసారి కూడా ఆ ప్రయత్నం బెడిసి కొట్టిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.