ఫేక్ ప్రకటనతో షాక్ అయిన మెగా ఫ్యాన్స్

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్ చరణ్‌కి, అందరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మామూలుగా అయితే చెర్రీ బర్త్ డే అంటే ఆ హడావుడి ఓ రేంజ్‌లో ఉండేది. అయితే కరోనా కారణంగా తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశాడు చరణ్.  దాంతో సోషల్ మీడియాలోనే బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఈ మెగా పవర్ స్టార్.

అయితే ఓ ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిన వార్త, చరణ్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. యూవీ క్రియేషన్స్ పేరిట క్రియేట్ చేసిన ఓ అకౌంట్‌లో ‘రామ్ చరణ్ తన తర్వాతి సినిమా డైరెక్టర్ సుజిత్‌తో చేయబోతున్నాడు’ అంటూ ట్వీట్ చేశారు. దాంతో మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ‘ఏమైంది ఈ వేళ’ సినిమా చూసి దర్శకుడు సంపత్ నందికి ‘రచ్ఛ’ ఛాన్స్ ఇచ్చిన చరణ్… ‘సాహో’ సినిమా చూశాక కూడా సుజిత్‌కు అవకాశం ఇచ్చాడా… అని ఆశ్చర్యపోయారు. అయితే అది ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిన ఫేక్ న్యూస్ అని తెలిసాక కుదుటపడ్డారు.

ప్రస్తుతం’ఆర్ఆర్ఆర్’సినిమా చేస్తున్న చరణ్, తన తర్వాతి సినిమాపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాటు సుజిత్, వంశీ పైడిపల్లి కూడా చరణ్‌‌తో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్న దర్శకుల లిస్టులో ఉన్నారు. మరి ఈ వార్త నిజమై చరణ్, సుజిత్‌తో సినిమాకు కమిట్ అయితే మాత్రం…  ‘సాహో’ దెబ్బకు ఖాళీగా ఉన్న సుజిత్‌కు మళ్లీ ఓ బంపర్ అవకాశం దక్కినట్టే.