సినిమా కథను తలపిస్తున్న ‘సుశాంత్ మిస్టరీ’

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడి రెండు వారాలు దాటిపోయింది. అతడి అభిమానులు, మద్దతుదారులు ఇంకా చల్లబడలేదు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. హత్య అని కొందరు ఆరోపిస్తున్నారు. అతను ఆత్మహత్య చేసుకోక తప్పని పరిస్థితి బాలీవుడ్ బడా బాబులు కల్పించారన్నది వారి ఆరోపణ. ఐతే ఇండస్ట్రీ సుశాంత్‌ ఎదగకుండా అణగదొక్కడంతో అతను డిప్రెషన్‌కు గురయ్యాడని, ప్రేమ వ్యవహారంలో వైఫల్యం కూడా కుంగదీసిందని.. ఇలా రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు.

ఐతే వీటిని దాటి కొత్త కోణాలు వెలికి తీస్తున్న వాళ్లూ లేకపోలేదు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం వెనుక చాలా పెద్ద కథే ఉందంటూ.. సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. అది చదువుతుంటే సినిమా కథల్ని తలపిస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే..?

సుశాంత్ దగ్గర మేనేజర్‌గా పని చేస్తున్న దిశా అతను చనిపోవడానికి కొన్ని రోజుల ముందే తన అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆమె బాలీవుడ్ యువ కథానాయకుడు సూరజ్ పంచోలి (ఒకప్పుడు ఆత్మహత్య చేసుకున్న జియాఖాన్ బాయ్‌ఫ్రెండ్)తో కొంత కాలంగా ప్రేమలో ఉందట. అతడి వల్ల ఆమె ప్రెగ్నెంట్ అయిందట.

అతను గర్భం తీయించుకోమన్నాడట. తను కుదరదందట. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని.. ఈ మొత్తం వ్యవహారం సుశాంత్‌కు తెలుసని.. అతను మీడియా ముందుకు రావాలనుకున్నాడని.. ఐతే సుశాంత్ గర్ల్‌ప్రెండ్‌ రియాకు బాగా క్లోజ్ అయిన మహేష్ భట్‌కు విషయం తెలిసి సూరజ్‌ కుటుంబానికి బాగా క్లోజ్ అయిన సల్మాన్‌కు చేరవేశాడని.. అందరూ గ్రూప్ అయి సుశాంత్ మరణానికి కారణమయ్యారని.. ఐతే జియా ఆత్మహత్య వ్యవహారంలో సూరజ్‌ను కాపాడినట్లే ఇప్పుడు కూడా సల్మాన్.. అతడితో పాటు ఎవరూ దొరక్కుండా పోలీసుల్ని మేనేజ్ చేసి సుశాంత్‌ది మామూలు ఆత్మహత్యలాగే మార్చే ప్రయత్నం చేస్తున్నాడని.. సీబీఐ ఎంక్వైరీ వేసి నిష్పాక్షికంగా విచారణ జరిపితే ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని సుశాంత్ మద్దతుదారులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content