ఇప్పటికే పలు వాయిదాల మధ్య ఫైనల్ గా ఆగస్ట్ 13న విడుదల కాబోతున్న కార్తికేయ 2 అంచనాలను అమాంతం పెంచేసుకునే పనిలో పడింది. ఫాంటసీ డ్రామాలను జనం ఆదరించే తీరు బింబిసారతో మరోసారి ఋజువు కావడంతో ఇప్పుడీ మూవీ మీద ఆసక్తి పెరుగుతోంది. నిఖిల్ కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కార్తికేయకు కొనసాగింపు కాదు.
పూర్తిగా వేరే కథను ఎంచుకుని హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోవడం లాంటి మార్పులు చాలానే చేశారు.తాజాగా రవితేజతో ట్రైలర్ లాంచ్ జరిగింది. ద్వారకా నగరంలో మాయమైపోయిన శ్రీకృష్ణుడి రహస్యం కోసం సమస్త ప్రపంచం వెతుకుతూ ఉంటుంది. తన తల్లితో పాటు మొక్కు తీర్చుకునేందుకు అక్కడికి వెళ్లిన ఓ డాక్టర్(నిఖిల్)కు ఇది ఛేదించాల్సిన బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.
అయితే ఇదంత సులభంగా ఉండదు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన ఈ ప్రమాదాన్ని ఎదురుకునేందుకు తన శక్తికి మించి పోరాడాల్సి వస్తుంది. సముద్రాలు దాటి ఎన్నో గండాలు స్వాగతం పలుకుతాయి. చివరికి తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే కార్తికేయ 2లోని అసలు కథగా కనిపిస్తోంది.
పాయింట్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. విజువల్స్ తో దర్శకుడు చందూ మొండేటి ఊహించిన దానికన్నా చాలా థ్రిల్స్ ప్లాన్ చేసినట్టుగా ట్రైలర్ తో ఇంప్రెస్స్ చేశారు. గతంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఇలాంటి థీమ్ తోనే దేవిపుత్రుడు వచ్చింది కానీ దాన్ని మించిన హై ఎండ్ గ్రాఫిక్స్ తో పాటు కంటెంట్ పరంగా తీసుకున్న శ్రద్ధ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. ఇది కనక ఆడియన్స్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయితే ఆగస్ట్ నెల ఖాతాలో మరో సూపర్ సక్సెస్ దక్కినట్టే. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ దీని ద్వారానే టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు.
This post was last modified on August 7, 2022 6:48 am
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…