ఇప్పుడు నడుస్తున్నది ఓటీటీ టైం. కొత్త సినిమాల థియేట్రికల్ రిలీజ్ గురించి మాట్లాడుకునే రోజులు వెళ్లిపోయాయి. మళ్లీ ఆ రోజులు ఎప్పుడొస్తాయో కూడా తెలియదు. మరో మార్గం లేక చిన్న, మీడియం రేంజి సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లోకి వచ్చేస్తున్నాయి. తెలుగులో ఈ ట్రెండు ఊపందుకోవడానికి కొంచెం టైం పట్టింది.
‘అమృతారామ్’ తర్వాత మరో సినిమా రిలీజవ్వడానికి రెండు నెలలు పట్టింది. సత్యదేవ్ సినిమా ‘47 డేస్’ మూడు రోజుల కిందటే జీ5లో రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే హీరో మరో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.
‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా.. సత్యదేవ్ హీరోగా తెరకెక్కించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ జులై 15 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు నెల కిందటే ప్రకటించారు. ఎట్టకేలకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఫాహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కి మలయాళంలో మంచి విజయం సాధించి, క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న ‘మహేషింటే ప్రతికారం’ చిత్రానికి ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ రీమేక్ కావడం విశేషం. ‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి ఒరిజినల్ మూవీని అందించిన వెంకటేష్ మహా.. రెండో ప్రయత్నంలో ఇలా రీమేక్‌ను ఎంచుకోవడం విశేషమే. ఐతే అతను ఎంచుకున్న రీమేక్ మాత్రం ప్రత్యేకమైందే. దానికి మహా ఎలాంటి టచ్ ఇచ్చాడు.. సత్యదేవ్ లాంటి మంచి నటుడిని ఎలా ఉపయోగించుకున్నాడు అన్నది ఆసక్తికరం.
‘బాహుబలి’ తర్వాత ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన సినిమా ఇదే కావడం మరో విశేషం. ‘కంచరపాలెం’ నిర్మాత ప్రవీణ పరుచూరి కూడా ఇందులో నిర్మాణ భాగస్వామే. ఇటీవలే నెట్ ఫ్లిక్స్‌లో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తరహాలోనే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ కూడా మంచి ఫలితాన్నందుకుంటుందనే అంచనాలున్నాయి.
This post was last modified on July 3, 2020 9:11 am
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…