మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న గాడ్ ఫాదర్ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. నిన్న సల్మాన్ ఖాన్ చిరుల కాంబినేషన్ పాటని ప్రభుదేవా నృత్యదర్శకత్వంలో ముంబై వేదికగా పూర్తి చేశారు. తాజాగా సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహంతో ఈ సినిమాను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
లూసిఫర్ ఫ్లేవర్ ని పూర్తిగా మార్చేసి చెడగొడుతున్నారని, అసలు ఒరిజినల్ వెర్షన్ లో లేని ఈ కాంబో పాటని ఇందులో ఎలా ఇరికించారని ఏదేదో అనేస్తున్నారు. మలయాళంలో ఐటెం సాంగ్ ఉంది కానీ ఇది లేని మాట వాస్తవమే. నిజానికి లూసిఫర్ ని మక్కికి మక్కి దించేస్తే తెలుగులో ఆడదు. ఎందుకంటే అది చాలా సీరియస్ టెంపోలో సాగుతుంది.
హీరో ఇంట్రోనే అరగంట తర్వాత వస్తుంది. ఇక పాటలు అసలే లేవు. మూడు గంటల నిడివితో ల్యాగ్ కూడా అనిపిస్తుంది. దానికి తోడు వివేక్ ఒబెరాయ్ క్యారెక్టర్ (సత్యదేవ్ చేసేది)కు పెట్టిన ట్విస్టు మన ఆడియన్స్ ఆమోదించేలా ఉండదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే దర్శకుడు మోహన్ రాజా మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని కీలక మార్పులు చేశారు. వాటిలో కొన్ని సర్‌ప్రైజ్ లు కూడా ఉంటాయని టాక్ ఉంది.
కొంచెం వెనక్కు వెళ్తే ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన గబ్బర్ సింగ్, ఘరానా మొగుడు, పెదరాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ కు వాటి మాతృకలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. టాలీవుడ్ జనాల అభిరుచులకు తగ్గట్టు చేసిన మార్పులు అద్భుతంగా పేలి ఆయా హీరోల కెరీర్లో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయాయి. ఆ కోణంలో చూస్తే గాడ్ ఫాదర్ లో కూడా అలాగే జరిగి ఉండొచ్చు కదానేది ఫ్యాన్స్ వెర్షన్. ఇందులో లాజిక్ ఉంది. ఇంకా రిలీజే కాకుండా అప్పుడే ఇన్నేసి విమర్శలు ఎందుకనే ప్రశ్న సహజంగానే తలెత్తుంది. సమాధానం దొరకాలంటే విడుదల దాకా ఆగాల్సిందే
This post was last modified on August 1, 2022 7:20 pm
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…