రెండ్రోజులు నాలుగు సినిమాలు !

ప్రతీ వారం రెండు మూడు సినిమాలు రిలీజవుతుంటాయి. ఈ వారం కూడా ఓ నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఈ వారం రెండ్రోజుల్లో నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. అంటే రోజుకి రెండు సినిమాలు చొప్పున విడుదల అన్నమాట. వీరిలో కిచ్చా సుదీప్ , అరుల్ శరవణన్ తమ సినిమాలతో రేపే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సుదీప్ ప్రెస్టిజియస్ మూవీ విక్రాంత్ రోణ నాలుగు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. అలాగే తమిళ్ నాడులో ప్రముఖ బిజినెస్ మెన్ శరవణన్ హీరోగా లాంచ్ అవుతున్న ‘లెజెండ్’ సినిమా కూడా రేపే విడుదలవుతుంది. ఈ సినిమా కోసం అరుల్ దాదాపు అరవై కోట్లకు పైగా ఖర్చు పెట్టుకున్నాడు. హీరోగా నిలదొక్కుకొని కంటిన్యూ అవ్వాలని భావిస్తున్నాడు.

ఇక ఎల్లుండి అంటే జులై 29న రామారావు ఆన్ డ్యూటీ అంటూ రవితేజ థియేటర్స్ లోకి వస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా రిలీజ్ కి నోచుకుంది. ప్రమోషన్స్ బాగానే చేస్తున్నప్పటికీ ఆశించిన బజ్ మాత్రం రావడం లేదు. రవితేజ ‘ఖిలాడి’ డిజాస్టర్ అవ్వడం కూడా రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక ఇదే రోజు పంచ తంత్ర కథలు అనే చిన్న సినిమా ఒకటి విడుదలవుతుంది. దీని మీద ఎలాంటి అంచనాలు లేవు కానీ ప్రీమియర్ తో మంచి టాక్ అందుకుంది. కానీ బడా సినిమాల రిలీజ్ కారణంగా దీనికి థియేటర్స్ దక్కని పరిస్థితి.

ఈ వారం రవితేజ సినిమాతో పాటు ఓ కన్నడ సినిమా , తమిళ్ సినిమా తెలుగులో డబ్బింగ్ మూవీస్ గా రిలీజ్ అవుతున్నాయి. వీటిలో దేనికి సరైన బుకింగ్స్ లేవు. రామారావు ఆన్ డ్యూటీ బుకింగ్స్ కూడా డల్ గానే ఉన్నాయి. ఇక విక్రాంత్ రోణ కి బెంగళూరులో మంచి బుకింగ్స్ ఉన్నాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బుక్ మై షో పచ్చగానే కనిపిస్తుంది. ఇక లెజెండ్ సంగతి సరేసరి. అస్సలు ఈ సినిమా చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. మరి వీటిలో ఏ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందో ? లాంగ్ రన్ లో విజేతగా నిలిచేదెవరో చూడాలి.