టీమ్ కి సారీ చెప్పిన అనసూయ

పెద్ద సినిమాలను ప్రమోట్ చేయడానికి ఎవరూ అక్కర్లేదు. స్టార్ ఇమేజ్, ఫ్యాన్ బేస్ తో ఆ సినిమాలు సోషల్ మీడియాలో గట్టిగానే ప్రమోట్ అవుతుంటాయి. కానీ చిన్న సినిమాలకు అలా కాదు. అందులో నటించిన వారిలో ఓ మోస్తరు పరిచయం ఉన్న ఆర్టిస్ట్ ముందుకొచ్చి ప్రమోషన్ చేస్తే సినిమా అంతో ఇంతో రీచ్ అవుతుంది. అనసూయ లాంటి యాక్ట్రెస్ ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇస్తే సినిమా మీద బజ్ క్రియేట్ అవుతుంది. అయితే ఇలానే ప్లాన్ చేసుకొని ‘దర్జా’ రిలీజ్ గురించి దర్జాగా ఉన్నారు నిర్మాతలు. కానీ అనసూయ సినిమా రిలీజ్ ప్రమోషన్ లో కనిపించకుండా హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకూ టీం ఎన్ని ప్రమోషన్స్ చేసిన అవి ఎక్కడా కనబడని పరిస్థితి.

అనసూయ రిలీజ్ కి ముందు తమ సినిమాను ప్రమోట్ చేసే రోజు కోసం ఎదురుచూశారు మేకర్స్. సినిమాలో సునీల్ కూడా నటించాడు కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరు కాలేదు. ఇక అనసూయ మాత్రం మేకర్స్ సారీ చెప్పుకుంది. తను ఇప్పటి వరకూ ప్రమోషన్స్ లో ఎందుకు కనబడలేదనే విషయం టీంకి బాగా తెలుసని తెలిపింది.

పర్సనల్ విషయాల కారణంగా పెండింగ్ పడ్డ షూటింగ్స్ అన్నీ ఒకేసారి వచ్చాయని వాటితో నటిగా బిజీ అయ్యానని ముఖ్యంగా హైదరాబాద్ కి దూరంగా షూటింగ్ చేస్తున్నాని అందుకే దర్జా ప్రమోషన్స్ లో కనిపించలేదని తెలిపింది. సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు. అక్కడ అనసూయ ఇలా తన వర్షన్ చెప్పుకొని టీమ్ ని కూల్ చేసింది. ఈ రీజన్ తో అనసూయ తప్పించుకుంది ఫైనల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై మమ అనిపించుకుంది. ఇక ఆ మధ్య అనసూయ నటించిన ‘కథనం’ ఆడలేదు. మరి ఈ సినిమాతో అయినా అనసూయ సోలో హిట్ కొడుతుందా ? చూడాలి.