పాత సినిమాలను చూసి సన్నివేశాలు అల్లుకోవడం, కథలు తీర్చిదిద్దుకోవడం, వాటితో మంచి ఫలితాలు అందుకోవడం కొత్తేమీ కాదు. రాజమౌళి తండ్రి కథ అందించిన బాలీవుడ్ మూవీ ‘భజరంగి భాయిజాన్’కు ‘పసివాడి ప్రాణం’ స్ఫూర్తిగా నిలిచిన విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. అంతకుముందు రాజమౌళి కెరీర్ ఆరంభంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సింహాద్రి’ మూవీకి ‘వసంత కోకిల’ ఇన్‌స్పిరేషన్ అయిన సంగతి తెలిసిందే. విజయేంద్ర ఇలా చాలా వరకు పాత సినిమాల స్ఫూర్తితోనే కథలు, సన్నివేశాలు రాస్తుంటారనే టాక్ ఉంది ఇండస్ట్రీలో.
‘బాహుబలి-2’ ఇంటర్వెల్ సీన్‌కు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రి రిలీజ్ ఈవెంట్లలో చేసే హంగామానే ఇన్‌స్పిరేషన్ అని కూడా విజయేంద్ర వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్ఫూర్తి పొందడానికి కాదేదీ అనర్హం అనడానికి ఇది రుజువు. ఇక విజయేంద్ర చివరగా కథ అందించిన ‘ఆర్ఆర్ఆర్’లోనూ ఇంటర్వెల్ సీన్ ఓ పాత సినిమా స్ఫూర్తితో తీసింది, ఈ కథకు కూడా కొంత మేర ఆ సినిమా ఆధారంగా నిలిచింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు.
కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా ‘మంచి మిత్రులు’ అనే సినిమా ఒకటి వచ్చింది. 1969లో విడుదలైన ఆ చిత్రంలో కృష్ణ దొంగ పాత్రలో కనిపిస్తే.. శోభన్ బాబు పోలీస్ పాత్ర చేశాడు. ఐతే మిత్రులైన ఈ ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియదు. చివరికి ఓ సన్నివేశంలో అసలు విషయం రివీల్ అవుతుంది. నిన్ను పట్టుకోవడానికి మారు వేషంలో తిరుగుతున్న పోలీసుని నేను.. అంటూ కృష్ణకు శోభన్ బాబు షాకిస్తాడు.
కొంచెం అటు ఇటుగా సరిగ్గా ఇదే లైన్లో ‘ఆర్ఆర్ఆర్’ నడవడం.. ఇంటర్వెల్ సీన్లో తాను పోలీసునని వెల్లడిస్తూ తారక్‌ను అరెస్ట్ చేయడానికి చరణ్ ప్రయత్నించడం తెలిసిందే. ఇప్పుడు ‘మంచి మిత్రులు’ సినిమాలోని సన్నివేశం సోషల్ మీడియాలో తిరుగుతోంది. అది చూసి అందరూ ‘ఆర్ఆర్ఆర్’ ఇంటర్వెల్ సీన్‌కు ఇదా స్ఫూర్తి అనుకుంటున్నారు. విజయేంద్ర ప్రసాద్ ట్రాక్ రికార్డును గమనిస్తే.. కచ్చితంగా ఆ సినిమా చూసే ఆయనీ సన్నివేశం రాసి ఉంటాడని.. పాత సినిమాల స్ఫూర్తితో ఆయన మరోసారి మ్యాజిక్ చేశారని అంటున్నారు నెటిజన్లు.
This post was last modified on July 14, 2022 9:43 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…