అభిమానులు ముద్దుగా చియాన్ అని పిలుచుకునే మల్టీ టాలెంటెడ్ హీరో విక్రమ్ ఆరోగ్యం గురించిన వార్తలు సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో చూశాం. ఈ విషయంగానే ఆయన కొడుకు ధృవ్ విక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేసి తమ ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని, పుకార్లకు స్వస్తి పలకాలని ఆన్లైన్ లో విజ్ఞప్తి చేశాడు.
ఇదిలా ఉండగా విక్రమ్ కొత్త మూవీ కోబ్రా ఆగస్ట్ 11న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి గాను విక్రమ్ ఒక అరుదైన ఘనత అందుకోబోతున్నాడు. ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం మొత్తం అయిదు బాషలకు తనే స్వయంగా డబ్బింగ్ చెబుతాడు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలకు విక్రమ్ గొంతే వినిపించబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కు ఈ ఘనత అందుకునే వాడే కానీ సమయాభావం వల్ల మలయాళంకు సాధ్య పడలేదు. లేదంటే ఈ రికార్డు తారక్ కు ఉండేది.
కొంచెం రిస్క్ అయినా సరే కోబ్రా అన్ని వెర్షన్లను గాత్రదానం చేస్తానని విక్రమ్ ముందుకు రావడం ఫ్యాన్స్ కి ఆనందం కలిగిస్తోంది. నిజానికి ఇతను గతంలో చేసిన సాహసాలతో పోలిస్తే ఇది నథింగని చెప్పాలి. అపరిచితుడు, మల్లన్న, ఐల కోసం ఒళ్ళు హూనం చేసుకుని ప్రాణాన్ని పణంగా పెట్టడం అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా తనను అభిమానించే వాళ్ళను సంతృప్తి పరచడం కోసం విపరీతంగా కష్టపడే విక్రమ్ కోబ్రాలో చాలా విచిత్రమైన వేషాల్లో దర్శనమివ్వబోతున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates