కెజిఎఫ్ హీరోయిన్ రాంగ్ ప్లానింగ్

మాములుగా ఏదైనా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు అందులో హీరో హీరోయిన్ల డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. ఒక్క రోజులో రెమ్యునరేషన్ తారాస్థాయికి చేరుకుంటుంది. ఆఫర్లు వెల్లువలా వచ్చి పడతాయి. ఉప్పెన దెబ్బకు కృతి శెట్టి రేంజ్ ఎక్కడికి వెళ్లిందో చూస్తున్నాం. పెళ్లి సందడి ఫ్లాపయినా శ్రీలీల చేతిలో ఆరేడు సినిమాలున్నాయి. అసలే కథానాయికల కొరతతో అల్లాడుతున్న సౌత్ ఇండస్ట్రీకి ఇప్పుడు బ్యూటీల అవసరం చాలా ఉంది. పూజా హెగ్డే, రష్మిక మందన్నలు అంత ఈజీగా అందరికీ దొరకరుగా.

కానీ విచిత్రంగా 1200 కోట్లు వసూలు చేసిన కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి మాత్రం ఇప్పటిదాకా ఏ కొత్త ప్రాజెక్టు సైన్ చేయలేదు. కొన్ని చర్చల దశలోనే ఉన్నాయి కానీ అంతకు మించి ముందడుగు పడలేదు. అలా అని ఎవరూ పట్టించుకోవడం లేదని కాదు. వచ్చిన దర్శక నిర్మాతలకు తన పారితోషికాన్ని చాలా భారీగా అడగడంతో పాటు కథ విషయంలో ప్రాధాన్యత గురించి మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతోందని బెంగళూరు టాక్. ఈ కారణంగానే కొన్ని క్రేజీ మూవీస్ చేజారిపోయాయని వినికిడి. తను మాత్రం ఎస్ చెప్పడం లేదు.

చూస్తుంటే శ్రీనిధి శెట్టి తనను తాను ఎక్కువ ఊహించుకున్నట్టుందని శాండల్ వుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కెజిఎఫ్ లోనూ అంతా రాఖీ భాయ్ వన్ మ్యాన్ షోనే కానీ శ్రీనిధి గొప్పగా పెర్ఫార్మ్ చేసేంత సీన్లు కానీ ఎమోషన్లు కానీ పడలేదు. అలాంటప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే బెటర్ కదా. కెజిఎఫ్ తో పాటు తమిళంలో చేసిన కోబ్రా ఇంకా విడుదల కావాల్సి ఉంది. అందులో ఎలాంటి పాత్రో ఇంకా తెలియదు, అసలే విక్రమ్ రకరకాల వేషాల్లో కనిపిస్తాడు. ఆ డామినేషన్ ని తట్టుకుని తనకెంత స్కోప్ దొరికిందో డౌటే.