హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విశ్వక్ సేన్ కి డీసెంట్ మార్కెట్ ఉందే తప్ప మరీ పది ఇరవై కోట్లు థియేట్రికల్ షేర్ గా తెచ్చేంత సీన్ అయితే ప్రస్తుతానికి లేదు. కాకపోతే అలాంటి బ్రేక్ వస్తుందనే గట్టి నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని పబ్లిసిటీ చేసిన పాగల్ సోసోగానే వెళ్ళింది. ఇటీవలే వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణంతో మంచి హిట్టే అందుకున్నాడు కానీ తను ఆశించిన రేంజ్ కైతే వెళ్లలేకపోయింది. ఓటిటిలో వచ్చినప్పుడు మాత్రం జనం బాగా చూశారు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ధమ్కీ చేస్తున్నాడు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఏకంగా యాక్షన్ కింగ్ అర్జున్ టీమ్ లోకి వెళ్లడం విశ్వక్ సీన్ బాగా ప్లస్ అయ్యేలా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అర్జున్ డైరెక్ట్ చేస్తున్న మూవీలో ఆయన కూతురు ఐశ్వర్య తెరకు పరిచయమవుతోంది. దీనికి గాను చాలా ఖరీదైన టెక్నికల్ బృందాన్ని సెట్ చేస్తున్నారు. మాటల రచయిత సాయి మాధవ్ బుర్రని నిన్న ప్రకటించారు. కోటి రూపాయలకు పై చిలుకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న రచయితల్లో త్రివిక్రమ్ తర్వాత ఈయనే ఉన్నారని ఇండస్ట్రీ టాక్. సో దీనికీ అంతే ఉంటుంది.
కెజిఎఫ్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే సగం బ్లాక్ బస్టర్ చేసిన రవి బస్రూర్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఈయన కూడా పారితోషికం విషయంలో పీక్స్ డిమాండ్ లో ఉన్నారు. అసలు ప్రొడక్షన్ కు వెళ్లకుండా ఖర్చు ఈ రేంజ్ లో కనిపిస్తోందంటే అర్జున్ వేసుకున్న స్కెచ్భ భారీగానే ఉంటుంది. అడపాదడపా దర్శకత్వం చేస్తూ ఈ మధ్య నటనకే పరిమితమైన అర్జున్ ఈసారి డైరెక్టర్ గా తన కంబ్యాక్ ని చాలా పవర్ ఫుల్ గా ప్లాన్ చేసుకున్నారట. మరి విశ్వక్ సేన్ కి ఇదెలాంటి బ్రేక్ గా మారుతుందో చూడాలి.
This post was last modified on June 22, 2022 11:02 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…