ఒకప్పుడు రిలీజ్ డేట్ మారుతోంది, సినిమా వాయిదా పడుతోంది అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోయేవాళ్లు సినీ జనాలు. కానీ కొవిడ్ దెబ్బకు మొత్తం కథ మారిపోయింది. ఈ రెండేళ్లలో ఎన్ని సినిమాలు ఎన్నెన్నిసార్లు రిలీజ్ డేట్లు మార్చుకున్నాయో, వాయిదాల మీద వాయిదాలు పడ్డాయో తెలిసిందే. కాబట్టే ఇప్పుడు ఎవరికీ సినిమాను వాయిదా వేయడం పట్ల పెద్దగా ఫీలింగ్ ఉండట్లేదు. జనాలు కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ మార్చడం, సినిమాను వాయిదా వేయడం మీద తమకు తామే జోక్స్ కూడా వేసుకుంటున్నాయి చిత్ర బృందాలు.
తాజాగా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ‘ప్రిన్స్’ సినిమాకు రిలీజ్ డేట్ మారింది. తమిళ స్టార్ శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ రూపొందిస్తున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని ముందు ఆగస్టు 31న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఈ మేరకు ప్రకటన ఇచ్చిన నెల లోపే డేట్ మార్చేశారు.
వినాయక చవితికి కాకుండా దీపావళి కానుకగా ‘ప్రిన్స్’ను విడుదల చేయబోతున్నారు. ఇందుక్కారణం ఆగస్టు 31కి సినిమాను రెడీ చేయలేకపోవడం కావచ్చు లేదా దీపావళికి రిలీజ్ చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని కావచ్చు. ఈ విషయాన్ని చెప్పడానికి ఒక ఫన్నీ వీడియోను రూపొందించింది చిత్ర బృందం. అందులో అనుదీప్, శివ కార్తికేయన్, సత్యరాజ్‌లతో పాటు హీరోయిన్ మరియా కూడా పాల్గొంది. ఇందులో అనుదీప్, శివ, సత్యరాజ్ ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకున్న తీరు భలే ఫన్నీగా ఉంది.
అనుదీప్ ఎంత టిపికల్‌గా ఉంటాడో, మాట్లాడతాడో, సినిమాలను మించి బయట ఎలా నవ్విస్తాడో ‘క్యాష్’ సహా కొన్ని ప్రోగ్రామ్స్‌లో అందరూ చూశారు. ఇందులోనూ అలాగే కామెడీ చేశాడు. మొత్తానికి సినిమా వాయిదా పడ్డ విషయాన్ని భలే ఫన్నీగా చెప్పి కొత్త డేట్ జనాల్లో రిజిస్టర్ అయ్యేలా చేయగలిగింది చిత్ర బృందం. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
This post was last modified on June 21, 2022 2:45 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…