సూపర్ స్టార్ మహేష్ బాబుకు చాన్నాళ్ల తర్వాత కెరీర్లో విరామం లభించింది. ‘ఖలేజా’ టైంలో చాలా గ్యాప్ తీసుకున్న మహేష్.. ఆ తర్వాత వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఎప్పుడూ గ్యాప్ తీసుకున్నది లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది కానీ.. స్క్రిప్టు నచ్చక ఆ సినిమాను పక్కన పెట్టేశాడు. దీని స్థానంలో వేరే ప్రాజెక్టు సెట్ చేసుకోవడానికి కొంచెం సమయం పట్టింది. ఈలోపు లాక్‌డౌన్ వచ్చి బ్రేకేసింది. దీంతో ఆరు నెలలుగా మహేష్ ఖాళీగా ఉన్నాడు. ఈ మధ్యే పరశురామ్ దర్శకత్వంలో కొత్త సినిమాను ఖరారు చేసినప్పటికీ.. వెంటనే చిత్రీకరణ మొదలుపెట్టే అవకాశమైతే లేకపోయింది. కరోనా ప్రభావం తగ్గి టాలీవుడ్లో షూటింగ్స్ ఊపందుకున్నాక ఈ చిత్రాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నారు.
ఐతే ‘సర్కారు వారి పాట’ ప్రి ప్రొడక్షన్ పనులైతే జోరుగానే సాగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ఓ ప్రముఖ స్టూడియోలో ఒక పెద్ద ఫ్లోర్‌ను అద్దెకు తీసుకుని అక్కడ కోట్ల ఖర్చుతో బ్యాంకు సెట్టింగ్ వేస్తున్నారట. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ పనులు నడుస్తున్నాయి. మహేష్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన సెట్లలో ఇదొకటని అంటున్నారు. ‘సర్కారు వారి పాట’ బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, మోసాల నేపథ్యంలో సాగే సినిమా అంటున్నారు. తన తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే పాత్రలో మహేష్ కనిపించనున్నాడట. సినిమాలో బ్యాంకు నేపథ్యంలో కీలక సన్నివేశాలు ఉంటాయని.. ఇక్కడే పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని.. అందుకోసమే ఈ సెట్ నిర్మిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు సంగీత దర్శకుడు తమన్, పరశురామ్ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌లోనూ పాల్గొంటున్నారని.. సినిమా మొదలయ్యే సమయానికే ఆడియో రెడీ అయిపోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ ఉమ్మడిగా నిర్మించనున్నాయి. కీర్తి సురేష్ ఇందులో కథానాయికగా నటించనుంది.
This post was last modified on June 27, 2020 9:47 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…