Movie News

హమ్మయ్య.. ఎట్టకేలకు ఫస్ట్ హిట్

ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజయ్యే సినిమా అంటే ఒక రకమైన చిన్న చూపు వచ్చేసింది జనాలకు. ఈ కోవలో రిలీజవుతున్న ప్రతి సినిమా ప్రతికూల ఫలితం అందుకుంటుండటంతో వాటి పట్ల నెగెటివ్ ఫీలింగ్ పడిపోయింది. ‘అమృతారామమ్’ మొదలుకుని.. ‘పెంగ్విన్’ వరకు నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో రిలీజైన ఏ సినిమా కూడా సానుకూల స్పందన తెచ్చుకోలేదు.

దీంతో థియేటర్లలో రిలీజ్ చేస్తే మంచి ఫలితాన్ని అందుకుంటాయన్న కాన్ఫిడెన్స్ లేని చిత్రాలనే ఇలా రిలీజ్ చేస్తున్నారనే భావన జనాల్లో వచ్చేసింది. ఈ సినిమాల విషయంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా పునరాలోచించడం మొదలైంది. ముందులా మంచి డీల్స్ కూడా రావట్లేదని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలో డైరెక్ట్ ఓటీటీ సినిమాల పట్ల అందరి దృక్పథాన్ని మార్చింది ‘కృష్ణ అండ్ హిజ్ లీల’.

ఇంతకుముందు నేరుగా ఓటీటీల్లో రిలీజైన చిత్రాలకు భిన్నంగా దీన్ని విడుదల చేశారు. ముందు రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఏ ఫ్లాట్‌ఫామ్‌లో వస్తుందని ప్రకటించలేదు. మొన్న ఉన్నట్లుండి అర్ధరాత్రి చడీచప్పుడు లేకుండా నెట్‌ప్లిక్స్‌లోకి వదిలేశారు. ఏ అంచనాలు లేకుండా అనుకోకుండా సినిమా చూసిన జనాలకు అది బాగానే ఎక్కేసింది. గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ కామెడీస్‌లో ఇదొకటని అంటున్నారు.

రివ్యూలన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. సోషల్ మీడియాలో జనాల స్పందన కూడా బాగుంది. చిత్ర బృందం ప్రచారం చేసుకుంటున్నట్లుగా ఫస్ట్ డిజిటల్ బ్లాక్‌బస్టర్ అనలేం కానీ.. ఈ ఫ్లాట్ ఫాంలో ఫస్ట్ హిట్ అని మాత్రం చెప్పొచ్చు. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ కన్ఫమ్ చేసుకున్న చిత్రాలకు.. విడుదలకు సన్నాహాల్లో ఉన్న చిత్రాలకు ఊరటనిచ్చే విషయమే. ఇలా ఇంకో రెండు మూడు మంచి సినిమాలు పడితే.. ఆ తర్వాత మరిన్ని సిినిమాలు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యే అవకాశముంది.

This post was last modified on June 27, 2020 9:41 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

సుధీర్ బాబుతో తలపడుతున్న ఆనంద్ దేవరకొండ

ఏదైనా డేట్ ఖాళీగా ఉండటం ఆలస్యం దాని మీద మీడియం, చిన్న సినిమాల నిర్మాతలు కర్చీఫ్ వేసుకోవడానికి పోటీ పడుతున్నారు.…

36 mins ago

ప్రశాంత్ వర్మ ‘రాక్షస’ ప్లానింగ్

హనుమాన్ బ్లాక్ బస్టర్ తో ఒక్కసారిగా టాప్ లీగ్ లోకి వెళ్ళిపోయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ…

2 hours ago

రౌడీ టైటిల్‌తో విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు విజయ్ దేవరకొండ చూసింది మామూలు రైజ్ కాదు. మెగాస్టార్ చిరంజీవి సైతం…

2 hours ago

బీజేపీ దెబ్బంటే ఇలా ఉంటుంది!

ఎన్నిక‌ల్లో వ్యూహాలు ఉండ‌డం వేరు.. ఎదుటి పార్టీల‌ను దెబ్బ కొట్టాల‌న్న కుయుక్తులు ఉండ‌డం వేరు. వ్యూహాలు ఎన్న‌యినా.. ప్ర‌త్య‌ర్థులు ప్ర‌తివ్యూహాల‌తో…

2 hours ago

మే 3 – పంచ సినిమాల యుద్ధం

ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏప్రిల్ నెల తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో సినీ ప్రేమికులు, బయ్యర్ల ఆశలన్నీ మేకి వచ్చేశాయి.…

3 hours ago

కమలంతో తెలంగాణ కాంగ్రెస్ కయ్యానికి కాలుదువ్వుతుందా ?

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అత్యధిక స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు బీజేపీ అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నది. ఇక…

3 hours ago