దక్షిణాదిన ఎలాంటి పాత్రనైనా పోషించగల టాలెంటెడ్ హీరోయిన్లలో రెజీనా కసాండ్రా ఒకరు. అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ ఒక స్థాయికి మించి ఎదగలేకపోయిన రెజీనా.. ఏ పాత్రలోనూ నిరాశపరిచిన దాఖలాలైతే లేవు. ఆమె కొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసింది. గత ఏడాది డిజాస్టర్ అయిన సెవన్ అనే తెలుగు సినిమాలో ఏదైనా చెప్పుకోదగ్గ అంశం ఉందంటే.. రెజీనా చేసిన విలన్ పాత్రే. ఐతే అలాంటి చిన్న సినిమాలో నెగెటివ్ రోల్ చేయడం పెద్ద విషయం కాదు కానీ.. ఇప్పుడు రెజీనా ఓ స్టార్ హీరో సినిమాలో ఓ సంచలన విలన్ పాత్ర చేసినట్లు సమాచారం. ఆ హీరో విశాల్ కాగా.. సినిమా పేరు చక్ర.
విశాల్ ఇంతకుముందు చేసిన ఇరుంబు తిరై (తెలుగులో అభిమన్యుడు)కు కొనసాగింపులా కనిపిస్తున్న సైబర్ థ్రిల్లర్ చక్ర. ఆనందన్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. ఇందులోనూ విశాల్ మిలటరీ ఆఫీసర్ పాత్రనే చేస్తుండగా.. హ్యాకింగ్‌లో ఆరితేరిన విలన్ మొత్తం వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని అందరినీ ఓ ఆటాడించే నేపథ్యంలో కథ నడిచేట్లు కనిపించింది ట్రైలర్ చూస్తే. అభిమన్యుడులో విలన్ అర్జున్ అనే విషయం ముందే వెల్లడైపోయింది. కానీ చక్రలో విలన్ ఎవరన్నది ట్రైలర్లో చూపించలేదు.
ఐతే ఆ పాత్ర చేసింది రెజీనా అని.. లేడీని పెద్ద విలన్‌గా చూపించడమే ఇందులో ట్విస్టు అని చిత్ర వర్గాల సమాచారం. శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రెజీనా కూడా నటిస్తున్నట్లు ఇంతకముందు వెల్లడైంది కానీ.. ట్రైలర్లో ఆమె ఎక్కడా కనిపించలేదు. రెజీనా మాత్రం సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుండటం విశేషం. విలన్ పాత్ర కావడం వల్ల దాన్ని సస్పెన్సుగా పెట్టారని సమాచారం. ఉన్నట్లుండి ట్రైలర్‌తో హడావుడి చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలొస్తున్నాయి.
This post was last modified on June 27, 2020 11:30 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…