సంక్రాంతిపై బాలయ్య కన్ను ?

టాలీవుడ్ లో కొందరు హీరోలకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ప్రతీ సంక్రాంతికి తన సినిమా రిలీజ్ అవ్వాలని దర్శక , నిర్మాతలపై ఒత్తిడి పెంచుతుంటారు. ఆ లిస్టులో బాలయ్య కూడా ఒకరు. అవును బాలక్రిష్ణ కి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఎప్పటి నుండో సంక్రాంతి హీరోగా విజయాలు అందుకుంటూ వస్తున్నాడు నందమూరి నటసింహం. కాకపోతే మూడేళ్ళుగా సంక్రాంతి కి రాలేకపోయాడు. ఇప్పుడు వచ్చే సంక్రాంతిపై బాలయ్య కన్ను పడింది.

అవును అనిల్ రావిపూడితో బాలయ్య చేయబోయే సినిమాను 2022 సంక్రాంతి రిలీజ్ అనుకుంటున్నారు. ఈ మేరకు ప్లానింగ్ కూడా రెడీ అవుతుంది. ఐదారు నెలల్లో షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది జనవరిలో సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఇక తక్కువ డేస్ స్టార్ తో సినిమా చేయడం అనిల్ తెలిసిన విద్యే. మహేష్ బాబు లాంటి స్టార్ ని పెట్టుకొని ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను ఐదు నెలల్లోనే కంప్లీట్ చేశాడు. అందుకే ఇప్పుడు బాలయ్య కూడా తమ కాంబో సినిమాను జెట్ స్పీడులో ఫినిష్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలకు చెప్పేశాడని తెలుస్తుంది.

ఈ సినిమాతో బాలయ్య ని అనిల్ సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడు. ఫాదర్ , డాటర్ సెంటిమెంట్ తో తన మార్క్ కామెడీ యాడ్ చేసి యాక్షన్ డ్రామాగా సినిమాను తెరకెక్కించనున్నాడు. సినిమాలో బాలయ్య కి కూతురుగా శ్రీలీల కనిపించనుంది. జులై లేదా ఆగస్ట్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ పరీశీలనలో ఉంది. త్వరలోనే సినిమాను గ్రాండ్ గా ప్రారంభించనున్నారు.