రానాకి మంచి ఛాన్స్

Virata Parvam

మొన్నటి వరకూ బడా సినిమాలన్నీ థియేటర్స్ కి క్యూ కట్టడంతో మీడియం బడ్జెట్ సినిమాలన్నీ సైడ్ అయిపోయాయి. ‘ఎఫ్ ౩’ వరకూ టాలీవుడ్ లో బడా సినిమాలు రిలీజ్ ఉండటంతో ఆ సినిమా రిలీజ్ తర్వాత చిన్న చితకా సినిమాలన్నీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మొన్న వారం వరకూ కాస్త బజ్ ఉన్న సినిమాలు ప్రతీ వారం సందడి చేశాయి. ప్రతీ వారం ఓ కొత్త సినిమా రావడంతో సెకండ్ వీక్ లో సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టలేకపోతున్నాయి. గత వారం విక్రమ్, మేజర్ మంచి వసూళ్ళు అందుకున్నాయి. కానీ ఈ వారం ‘అంటే సుందరానికీ’ రిలీజ్ అవ్వడంతో ఆ రెండు సినిమాల కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది.

ఇక ప్రతీ వారం మినిమం బజ్ ఉన్న సినిమాలు వస్తున్నప్పటికీ రానా ‘విరాటపర్వం’కి మాత్రం రెండో వారం టఫ్ ఇచ్చే సినిమా లేదు. అవును విరాట పర్వం రిలీజైన నెక్స్ట్ వీక్ తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా ఏమి రిలీజ్ అవ్వడం లేదు. ఇక జూన్ 17న వస్తున్న ఈ సినిమాకు గట్టి పోటీ కూడా లేదనే చెప్పాలి. సత్య దేవ్ ‘గాడ్సే’, తమిళ్ డబ్బింగ్ ‘ఏనుగు’ ఇలా ఏ మాత్రం బజ్ లేని సినిమాలు రానా సినిమాతో పాటు రిలీజవుతున్నాయి.

‘విరాటపర్వం’కి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రెండు వారాలు మంచి కలెక్షన్స్ రావడం ఖాయం. పైగా క్రౌడ్ పుల్లర్ సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటించింది. వెన్నెల అనే అమ్మయి ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ కి ఎక్కితే చాలు సూపర్ హిట్ లిస్టులో చేరుతుంది. ఇప్పటికే ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. మరి రానా, సాయి పల్లవి ఈ సినిమాతో నిర్మాతకి ఎలాంటి లాభాలు తెచ్చిపెడతారో చూడాలి.