అల వైకుంఠపురములో చిత్రానికి గీత ఆర్ట్స్ ని భాగస్వామిగా చేసిన అల్లు అర్జున్ తన తాజా చిత్రం పుష్ప కి కూడా తన బంధువు ఒకరిని పార్టనర్ గా పెట్టాడు. దీంతో ఈ చిత్రం బడ్జెట్ వ్యవహారాల్లో కూడా బన్నీ టీమ్ ఇన్వాల్వ్ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అల వైకుంఠపురములో చిత్రానికి దాదాపు నూట యాభై కోట్ల షేర్ వచ్చినపుడు పుష్ప కోసం ఒక బడ్జెట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
మునుపటి లెక్కలతో సినిమా తీస్తే కరోనా తర్వాతి కాలంలో వర్కవుట్ అవదు. అందుకే ఈ చిత్రం కోసం బడ్జెట్ తిరిగి ప్లాన్ చేస్తున్నారట. ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించవచ్చు అనేది తర్కించుకుంటూ లెక్కలు వేస్తున్నారట. ఇంతవరకు షూటింగ్ జరగకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అవుతోంది.
దీనివల్ల లొకేషన్స్, సెట్స్ దగ్గర్నుంచి అన్నిటినీ రీప్లాన్ చేసుకునే సౌకర్యం కుదిరింది. అయితే ఈ చిత్రానికి అవసరమయిన అటవీ నేపథ్యంకి సంబంధించిన సన్నివేశాలను ఎక్కడ తీయాలనేది ఇంకా కచ్చితంగా ఫిక్స్ అవలేదని తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates