ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ,మెరుగ్గా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న విక్రమ్ విజయానికి థాంక్స్ చెబుతూ కమల్ హాసన్ ఇవాళ తెలుగు తమిళ ప్రేక్షకులకు విడివిడిగా వీడియో మెసేజ్ లో థాంక్స్ చెప్పారు. సినిమాలో చివరి మూడు నిముషాలు థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేసిన సూర్యకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ తామిద్దరూ కలిసి చేయబోయే నెక్స్ట్ పార్ట్ లో ఫ్యాన్స్ కోరుకునేవన్నీ పూర్తి స్థాయిలో అందిస్తామని హామీ ఇచ్చేశారు. దీంతో విక్రమ్ హిట్ లిస్ట్ తర్వాత భాగం వస్తుందనే విషయం కన్ఫర్మ్ అయ్యింది.
నిజానికి సూర్య చేసింది చిన్న క్యామియోనే అయినప్పటికీ దాని ప్రభావం చాలా బలంగా ఉంది. ఆ క్యారెక్టర్ కి యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వయసు రిత్యా కమల్ తో వాళ్లకు ఆ స్థాయి కనెక్షన్ రాకపోయినా ఒకవేళ విక్రమ్ తో రోలెక్స్ క్లాష్ అయితే ఎలా ఉంటుందన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో విపరీతంగా సాగాయి.
ఇవి విన్నాడు కాబోలు లోకనాయకుడు స్వయంగా హామీ ఇవ్వడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. వీళ్లకు ఖైదీ రూపంలో కార్తీ తోడైతే అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు ట్విట్టర్ ఇన్స్ టాలో లోకేష్ మల్టీ వర్స్ అనే పదం బాగా ట్రెండ్ అవుతోంది. ఇది హాలీవుడ్ ట్రెండ్.
ఒకే సినిమాలో ముగ్గురు నలుగురు సూపర్ హీరోలు కలిసి రచ్చ చేయడం వీటిలో మెయిన్ పాయింట్. ఎవెంజర్స్, డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ లాంటివి మంచి ఉదాహరణలు. ఇప్పుడు విక్రమ్ లో కూడా ఇలాంటి ఫార్ములానే వాడాడు లోకేష్. అయితే ఈ సీక్వెల్ కి టైం పడుతుంది. ముందు విజయ్ తో ప్లాన్ చేసుకున్న తన అయిదో మూవీ పూర్తి చేశాక అప్పుడు కమల్ కోసం వెనక్కు వస్తాడు లోకేష్. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే
This post was last modified on June 7, 2022 7:22 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…