ప్రస్తుతం ఇండస్ట్రీలో సరైన కంటెంట్ దొరక్క రైటర్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు నువ్వా నేనా అనేలా పోటీ పడుతున్నాయి. కానీ ఈ అవసరాలను తీర్చేందుకు సరిపడా రచయితలు మాత్రం దొరకడం లేదు. తిప్పి తిప్పి పాత కథలనే రీమిక్స్ చేసుకుంటూ ఒకే ఫార్ములాలో వెళ్తూ క్రియేటివిటీని చూపించలేకపోతున్నారు. ఓటిటిలు పెరిగిపోయాయి. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి కార్పొరేట్ సంస్థలు బిజినెస్ పెంచుకోవడమే లక్ష్యంగా కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించుకుని క్వాలిటీకి పెద్ద పీఠ వేస్తున్నాయి. ఆడియన్స్ ని కట్టిపడేసేలా తీస్తామంటే చాలు బడ్జెట్ పరిమితులు ఉండవని చెబుతున్నాయి.
అందుకే న్యూ జనరేషన్ మేకర్స్ మెల్లగా పాత నవలల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇటీవలే హాట్ స్టార్ లో రిలీజైన 9 గంటలు ఎప్పుడో దశాబ్దాల క్రితం వచ్చిన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల. బోలెడంత సస్పెన్స్ తో థ్రిల్ చేస్తూ అప్పటి పత్రికలో సూపర్ హిట్ సీరియల్ గా నిలిచింది. దీన్ని ఇప్పటి ఆడియన్స్ సెన్సిబులిటీస్ కి తగ్గట్టుగా మార్చి తీయడం మంచి ఫలితాన్నే ఇస్తోంది. సమర్పకుల్లో ఒకరైన దర్శకుడు క్రిష్ వైష్ణవ్ తేజ్ తో చేసిన కొండపొలం కూడా పాపులర్ నవలే. ఆ మధ్య ఆహా యాప్ లో మెట్రో కథలు టైటిల్ తో పలాస దర్శకుడు కరుణ కుమార్ తో ఇలాంటి ప్రయత్నమే చేసింది. అదీ పర్వాలేదనిపించుకుంది. ఇలా చాలానే ఉన్నాయి.
నిజానికీ ఈ వింటేజ్ నవలల్లో వెతుక్కోవాలే కానీ బోలెడు మ్యాటర్ ఉంటుంది. యండమూరి, యద్దనపూడి, సూర్యదేవరలాంటి పాపులర్ రైటర్ల రచనలు ఎన్నో సినిమాలుగా మారడం 90 దశకం దాకా సాగింది. మధుబాబు రాసిన సుప్రసిద్ధ షాడో నవలలు త్వరలో వెబ్ సిరీస్ గా రాబోతున్నాయి. తవ్వుకుని చూస్తే ఇలాంటి సాహిత్యం బోలెడు దొరుకుతుంది. వాటిలో ఐడియాలను తీసుకుని ఇప్పటి జెనరేషన్ కు వండి వార్చితే బ్లాక్ బస్టర్ ఖాయం. మీనా నవలని నితిన్ అఆగా మార్చి త్రివిక్రమ్ లాంటి అగ్రదర్శకుడే హిట్టు కొట్టడం మర్చిపోకూడదు.
This post was last modified on June 3, 2022 6:14 pm
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…