జగపతిబాబు ప్రధాన పాత్రలో సీనియర్ నటి రాధిక నిర్మించిన ‘ధమ్’ సినిమా గుర్తుందా? డిజాస్టర్ అయిన ఈ చిత్రంతోనే నందమూరి కుటుంబానికి చెందిన చైతన్యకృష్ణ (ఎన్టీఆర్ తనయుల్లో ఒకడైన జయకృష్ణ కొడుకు) అరంగేట్రం చేశాడు. మామూలుగా ఇలాంటి పెద్ద కుటుంబాల నుంచి వచ్చే నటులు.. హీరోలుగానే ఎంట్రీ ఇస్తుంటాడు. కానీ చైతన్యకృష్ణ మాత్రం జగపతిబాబు హీరోగా నటించిన సినిమాలో ఓ కీలక పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.
ఐతే ఆ సినిమా డిజాస్టర్ అయింది. పైగా చైతన్యకృష్ణ లుక్స్, నటన విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో అతను మళ్లీ సినిమాల వైపు చూడలేదు. తాను సినిమాలకు సెట్ కానేమో అన్న ఉద్దేశంతో అతను ఇండస్ట్రీకి దూరమయ్యాడని అంతా అనుకున్నారు. రెండేళ్ల కిందట పెళ్లితో, కొన్ని నెలల కిందట భువనేశ్వరిపై వైకాపా నేతల కామెంట్లను ఖండిస్తూ నందమూరి ఫ్యామిలీ ప్రెస్ మీట్ పెట్టినపుడు మాట్లాడడం ద్వారా చైతన్యకృష్ణ వార్తల్లో నిలిచాడు.
ఐతే ఒక డిజాస్టర్ సినిమా చేసి, ప్రేక్షకుల తిరస్కారానికి గురై ఇండస్ట్రీకి దూరమైన నటుడు.. మళ్లీ దాదాపు 20 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడని ఎవ్వరూ అనుకోరు. కానీ చైతన్య కృష్ణ అదే సాహసం చేస్తున్నాడు. అతను హీరోగా కొత్త సినిమా మొదలైంది. కొన్ని రోజుల కిందటే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ‘బసవతారకమ్మ క్రియేషన్స్’ పేరుతో కొత్త బేనర్ మొదలవుతోందని అప్‌డేట్ బయటికి వచ్చింది. ఇందులో చైతన్యకృష్ణనే హీరో అని వార్తలు రాగా.. జనాలకు నమ్మకం కలగలేదు. ఇంత గ్యాప్ తర్వాత అతను ఇలాంటి సాహసం చేస్తాడా అని అనుమానపడ్డారు.
కానీ ఇప్పుడు ఈ వార్తే నిజమైంది. చైతన్యకృష్ణ నటుడిగా రీఎంట్రీ ఇస్తున్నాడు. హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం ఈ సినిమాను ప్రకటించారు. తలకు కట్టు, చెవిలో ఇయర్ బడ్, చేతిలో కాఫీ కప్పుతో చైతన్య సైడ్ లుక్ పోస్టర్ ఒకటి లాంచ్ చేశారు. ఐతే గతంలో నటుడిగా చేదు అనుభవం ఎదుర్కొని, లుక్స్ పరంగా చాలా యావరేజ్‌గా కనిపిస్తూ ఈ వయసులో మళ్లీ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చైతన్యకృష్ణ.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన తెచ్చుకుంటాడో చూడాలి మరి.
This post was last modified on May 28, 2022 5:32 pm
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…