ఎన్టీఆర్, మహేష్ భలే కుదిరింది 

ఒక్కోసారి కొన్ని కో ఇన్సిడెంట్స్ గా జరుగుతాయి. తాజాగా అలాంటి ఓ విషయమే ఎన్టీఆర్ , మహేష్ లకు జరుగుతంది. హీరోగా ఇప్పటి వరకూ 29 సినిమాలు చేశాడు తారక్. త్వరలోనే కొరటాల శివతో తన ముప్పైవ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 29వ సినిమాను రాజమౌళి డైరెక్షన్ లో చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మహేష్ కూడా సరిగ్గా ఇదే నెంబర్ తో రాజమౌళి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్న మహేష్ నెక్స్ట్ రాజమౌళి #SSMB29 చేస్తున్నాడు. 
నిజానికి రాజమౌళి తో ఇలా ఒకే నంబర్ సినిమా చేయడం ఎన్టీఆర్ , మహేష్ లకు అనుకోకుండా జరిగి ఉండొచ్చు.

కానీ బ్యాక్ టు బ్యాక్ ఈ ఇద్దరితో రాజమౌళి వారి 29 వ సినిమా చేయడం ఇంటరెస్టింగానే ఉంది. ప్రస్తుతం మహేష్ సినిమాకు సంబంధించి రాజమౌళి -విజయేంద్ర ప్రసాద్ కథా చర్చలు ఎండింగ్ వచ్చాయి. త్వరలోనే స్క్రిప్ట్ లాక్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడు జక్కన్న. 

ఈ మోస్ట్ ఎవైటింగ్ కాంబినేషన్ సినిమా ఎలా ఉండబోతుంది ? రాజమౌళి మహేష్ ఎలా చూపించబోతున్నాడు ? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. త్రివిక్రమ్ సినిమాను వీలైనంత ఫాస్ట్ గా ఫినిష్ చేసి రాజమౌళి సినిమా సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎగ్జైటింగ్ గా ఉన్నాడు మహేష్. మరి #SSMB29 ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో ? మహేష్ పాన్ ఇండియా హీరోగా ఎంతటి క్రేజ్ అందుకుంటాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.