టైటిల్స్ విషయంలో కొందరు దర్శకులు పైకి చెప్పకపోయినా కొన్ని సెంటిమెంట్లు బలంగా ఫాలో అవుతారనేది అందరికీ తెలిసిన విషయమే. కళాతపస్వి విశ్వనాథ్ శంకరాభరణం బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన సినిమాలన్నీ సతోనే మొదలయ్యాయి. సాగరసంగమం. స్వాతిముత్యం, స్వర్ణకమలం, స్వయంకృషి ఇలా సాగిపోయింది లైనప్. దీన్ని బ్రేక్ చేద్దామని ఆపద్బాంధవుడు, చిన్నబ్బాయి అని వేరే అక్షరాలాతో పెడితే ఫలితాలు తేడా కొట్టాయి. మళ్ళీ ఆయన ‘స’కు వెళ్ళిపోయినా మునుపటి స్థాయి విజయం దక్కలేదు.
ఇలాంటిదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్య బాగా ఫాలో అవుతున్నారు. అఆ, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, అతడు ఇలా అత్యధిక విజయాలన్నీ అతోనే మొదలయ్యాయి. అజ్ఞాతవాసి ఉంది కానీ ఫెయిల్యూర్స్ కంటే సక్సెస్ లే ఎక్కువ కాబట్టి దీన్ని పాజిటివ్ గానే చూడాలి. అందుకే నెక్స్ట్ చేయబోయే మహేష్ బాబు సినిమాకు అర్జునుడు టైటిల్ ని త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అప్పుడెప్పుడో పార్థు అని ప్రచారమయ్యింది కానీ ఫైనల్ గా ఇదే బెటరని ఫీలయ్యారట.
ఒకరకంగా అతడులో మొదటి చివరి అక్షరాలను తీసుకున్నట్టు అవుతుంది. అయితే మహేష్ గతంలో ఆల్రెడీ అర్జున్ చేశాడు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చెల్లి సెంటిమెంట్ గ్రాండియర్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మరి అర్జునుడికి ఓకే చెబుతాడా ,లేదానేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. తమ కాంబోలో చివరి మూవీ ఖలేజాకు టీవీలో ఎన్ని ప్రశంసలు వచ్చినా కమర్షియల్ గా ఫ్లాపే కాబట్టి ఈసారి బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే నిశ్చయంతో ఉన్నారు త్రివిక్రమ్. మరి ఎలాంటి సబ్జెక్టులో చూపించబోతున్నారో.
This post was last modified on May 23, 2022 4:19 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…